KTR Comments on Vizag Steel : విశాఖ ఉక్కుపై తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం దిగివచ్చింది - కేటీఆర్‌ !

0

విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడిరది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరే అని , తాము తెగించి కొట్లాడడం వల్లే కేంద్రం దిగివచ్చిందన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందన్నారు. సీఎం కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఇది భారాస, ఏపీ ప్రజలు, విశాఖ కార్మికుల విజయమని తెలిపారు.  

 స్టీల్‌ ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.

గురువారం విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్‌ పనిచేసే ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారులతో భేటీ అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం ఓ ఎత్తుగడ మాత్రమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !