YS Viveka Murder Case : రామోజీపై కక్షసాధింపు చర్యలే కొంపుముంచుతున్నాయా ?

0

 


  • వైఎస్‌ వివేకా హత్య కేసులో వేగం పెంచిన సిబిఐ.
  • ఊపందుకున్న అరెస్ట్‌ల పర్వం
  • సంచలన ఆరెస్ట్‌లకు అవకాశం.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదుకాబోతున్నాయా? ఇప్పుడిదే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  అరెస్టులు ఊపందుకోవడంతో ఇక కీలక వ్యక్తులను సైతం అదుపులో తీసుకుంటారని టాక్‌ నడుస్తోంది. ఇన్నాళ్లు సీబీఐతో ఆడుకున్న వారికి.. ఇప్పుడదే సీబీఐ చుక్కలు చూపిస్తోంది. కేసు విచారణ సమయంలో పులివెందులలో దర్యాప్తు అధికారును భయపెట్టడం, వారిపై కేసులు పెట్టడం రాజకీయ ఒత్తిళ్లతో కేసును ముందుకు సాగనీయకుండా అడ్డుకోవటం వంటి చర్యలకు పాల్పడ్డారు. వీలైనంత వరకూ దర్యాప్తును ఆలస్యం చేయడంలో సైతం విజయం సాధించారు. చివరకు దర్యాప్తు అధికారిని సైతం మార్చగలిగారు. దీంతో ఇక తాము బయటపడినట్టేనని రిలాక్స్‌ అయ్యారు. ఇంతలోనే సీన్‌ మారిపోయింది. ఇక వారం పదిరోజుల్లో కీలక వ్యక్తుల పేర్లు బయటకు రానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.

వెనువెంటనే మారిన పరిణామాలు

ఆది వివేకా హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చుట్టూనే కేసు నడుస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు 4 సార్లు విచారణ చేశారు. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. సీబీఐ దూకుడును తగ్గించడంతో పాటు ముందస్తు బెయిల్‌కు అప్లయ్‌ చేసుకున్నారు. అయితే సీబీఐ సిట్‌ మారడంతో ఇక తాను డేంజర్‌ జోన్‌లో లేననే ధీమాతో కనిపించారు. వెంటనే తెలంగాణ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇక తనకు ముప్పు ఉండదని భావించడంతోనే ఉపసంహరించుకున్నారు. దాదాపు రెండు వారాల పాటు రిలాక్స్‌ గా ఉన్నారు. కానీ అనూహ్యంగా సీబీఐ వరుస అరెస్టులతో హీట్‌ పుట్టిస్తోంది. సీబీఐ కొత్త టీమ్‌ ఇంత వేగంగా స్పందిస్తుందని అవినాష్‌ రెడ్డి  అస్సలు ఊహించలేదు. తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

దర్యాప్తు మొదలైనప్పటి నుంచీ ఆటంకాలే

ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుంచి సీబీఐ అధికారులకు ఆటంకాలు ప్రారంభమయ్యాయి. దర్యాప్తు వేగం పుంజుకుంటున్న కొద్దీ అవి మరింత తీవ్రమయ్యాయి. వైకాపా నాయకులు, పోలీసులు, నిందితులు, నిందితుల తరఫు వారు, అనుమానితులు అనేక అవరోధాలు సృష్టించారు. కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా చూడాలని యత్నించారు. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై గతేడాది ఫిబ్రవరి 18న పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో నిందితుడైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు కట్టారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆ ఎఫ్‌ఐఆర్‌పై స్టే వచ్చింది. ‘సీబీఐ బృందం వెంటనే కడప నుంచి వెళ్లిపోవాలి. లేకుంటే బాంబు వేసి పేల్చేస్తా. ఈ విషయాన్ని మీ అధికారులకు చెప్పండి’ అని ముసుగు ధరించిన ఓ వ్యక్తి తనను బెదిరించారని సీబీఐ అధికారుల వాహన డ్రైవర్‌ షేక్‌ వలీ భాషా కడప పోలీసులకు గతేడాది మే నెలలో ఫిర్యాదు చేశారు.

అత్యున్నత అధికారులతో టీమ్‌..

వాస్తవానికి వివేకానందరెడ్డి హత్యకేసును ఛేదించడానికి ఇంత సమయం అవసరమా? ఒక హత్య కేసును రెండు, మూడు రోజుల్లో ఏపీ పోలీసులు ఛేదిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన కేసులను సైతం త్వరిగతిన చిక్కుముడి విప్పి మరీ తేల్చేస్తున్నారు. అటువంటిది ప్రస్తుత సీఎం బాబాయ్‌, మాజీ సీఎం సోదరుడు హత్యకేసును సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ తేల్చలేదంటే అందులో రాజకీయ లాబీయింగ్‌, అదృశ్య శక్తులు ఏ స్థాయిలో పనిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ సీబీఐపై ఎటువంటి ఒత్తిడి లేకుంటే ఈ పాటికే ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎప్పుడో బయటకు వచ్చేవారు. సీబీఐలో రాంసింగ్‌ ఎస్పీ స్థాయి అధికారే. ఆయన దూకుడుకే అనుమానితులు, నిందితులు తట్టుకోలేకపోయారు. అటువంటిది అత్యున్నత టీమ్‌ను న్యాయస్థానం ఏర్పాటుచేసింది. ఈ నెల 31 లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే దర్యాప్తు అధికారిని మార్చేశామని సంబరాలు చేసుకున్న అవినాష్‌ రెడ్డి అండ్‌ కోకు కొత్త టీమ్‌ చుక్కలు చూపిస్తోంది.

రామోజీని ఇబ్బంది పెట్టవద్దన్న పెద్దలు..

వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచిన ప్రతిసారి ఢల్లీి స్థాయిలో చక్రం తిప్పి సైలెంట్‌ చేసేవారు. తరువాత పరిణామాలు సైతం సద్దుమణిగేవి. అయితే ఇటీవల జగన్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనికి రామోజీరావు ఎపిసోడే కారణమని తెలుస్తోంది. రామోజీ రావుకు ఢల్లీి పెద్దల వద్ద మంచి గౌరవమే ఉంది. ఆ గౌరవంతోనే రామోజీరావును ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు కేంద్ర పెద్దలు సూచించారు. కానీ ఆయన పెడచెవిన పెట్టారు. దీంతో కేంద్ర పెద్దలు కూడా జగన్‌ను పట్టించుకోవడం మానేశారు. అందుకే వివేకా హత్య కేసు పట్టుబిగుస్తోందన్న టాక్‌ నడుస్తోంది. అందుకే జగన్‌ సైతం ఢల్లీి పెద్దల ద్వారా కాకుండా వేరే మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. అయితే మునుపెన్నడూ లేని ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖంలో కళ సైతం తగ్గింది. ఎటువంటి సంచలనాలు నమోదవుతాయోనన్న బెంగ వెంటాడుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !