ఈతరం యువహీరోల్లో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31, హిందీలో స్పై యూనివర్స్ వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ లైనప్ లో ఉన్న సినిమాలతో తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో అగ్రెసివ్‌గా ప్రతినాయకుడి పాత్ర చేస్తే సౌత్‌తో పాటు నార్త్ బాక్సాఫీస్ కూడా షేక్ అవ్వడం ఖాయం. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ vs హ్రితిక్ రోషన్ మధ్య జరగబోయే యుద్ధం క్లాష్ ఆఫ్ టైటాన్స్‌లా ఉంటుంది. స్క్రీన్ పైన రెండు మద గజాలు పోరాడుతుంటే ఎలా ఉంటుందో ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ ఫైట్ చేస్తే అలానే ఉంటుంది, ఈ ఇద్దరూ డాన్స్ చేసినా నటరాజు డబుల్ రోల్‌లో నాట్యం చేసినట్లు ఉంటుంది. ఎన్టీఆర్ రాకతో ఒక సాలిడ్ విలన్ యూనివర్స్ లోకి ఎంటర్ అయ్యాడు. మేకర్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే థానోస్ అవెంజర్స్ రేంజులో సాలిడ్ సినిమా పడే ఛాన్స్ ఉంది. మరి ఫ్యూచర్ లో యష్ రాజ్ స్పై యాక్షన్ యూనివర్స్ లో ఎన్టీఆర్ ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చే రోల్ ప్లే చేస్తాడో చూడాలి.