Foxconn Manufacturing-Unit-In-Telangana : తెలంగాణలో ఐఫోన్‌ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ !

0
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ (Foxconn) టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 (200 మిలియన్‌ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఇక్కడ తయారీ కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూతో  కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

తెలంగాణలో ఐఫోన్‌ తయారీ 

చాలా మందికి ఫ్యాక్స్‌కాన్‌ ఏర్పాటుకీ, ఐఫోన్‌ తయారీకీ సంబంధమేంటి అనే డౌట్‌ వస్తుంది. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్‌. సుమారు 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ కంపెనీయే తయారు చేస్తున్నది. యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్‌ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్‌ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్‌కాన్‌, ఇప్పుడు ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతున్నది. వచ్చే సంవత్సరం చివరి నాటికి తెలంగాణలో కంపెనీ పూర్తవుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా ఐఫోన్ల తయారీ చేపట్టాలి అనుకుంటోంది. అంటే.. ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్న ఐఫోన్లు.. తెలంగాణలో తయారవ్వనుండటం గొప్ప విషయమే.

తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు

ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్‌ (KCR) నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడిరచారు. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ పవర్‌హౌస్‌గా తెలంగాణను మార్చుతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ (Foxconn) టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు కంపెనీ సీఈవో యాంగ్‌లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడిరచారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !