Varma Tweet Bbout PavanKalyan : నియంతలు కూడా ఇలాంటి మాటలు అనలేదు !

1 minute read
0

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొని తెచ్చుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. ప్రస్తుతం వర్మ.. మంచి సినిమాలు తీయడం మానేసి రాజకీయ బయోపిక్‌లు తీయడం మొదలుపెట్టాడు. ఇక సినిమాలు కాకుండా ట్విట్టర్‌లో టీడీపీ, జనసేన అధినేతలు అయిన చంద్రబాబు, పవన్‌ను విమర్శిస్తూ ట్వీట్‌ చేసి అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. తాజాగా మరోసారి వర్మ, జనసేనానిపై పంచులు వేశాడు. గత కొన్నిరోజులుగా పవన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో పవన్‌ కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం.

బ్రూటల్‌ వయోలెన్స్‌ని ప్రభోధిస్తున్న పవన్‌ !

ఇక ఆ వ్యాఖ్యలపై వర్మ సెటైర్లు వేశాడు.‘‘చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్న దాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలో కొస్తే పీక పిసికేసి చంపేస్తా , బట్టలూడదీసి పరిగెత్తిస్తా ,చర్మం వొలిచేస్తా లాంటి హింసాత్మకమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో హిట్లర్‌, సద్దాం, కిం జొంగ్‌ ఉన్‌తో సహా ఎవరూ అనుండరు. ఇంకో విషయమేంటంటే అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా ? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్‌కి డైరెక్ట్‌గా ఇంత బ్రూటల్‌ వయోలెన్స్‌ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం. ఇలాంటి హింసని ఎంకరేజ్‌ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్ల కొచ్చే ఆ యువకులను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో పవన్‌ కళ్యాణ్‌ కే తెలియాలి. పైగా ఈ వయోలేంట్‌ బెదిరింపులన్ని లైవ్‌ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్‌ రూమ్స్‌లో పిల్లలతో పాటు టీవిలో చూస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్‌ పై పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు ఇలా ట్వీట్‌ చేస్తుంటే.. సర్‌, మీరు ఇలాంటి మాటలు చెబుతుంటే, ప్రతివ్రత పరమాన్నం లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వెంటి వర్మ సడెన్‌గా గౌతమ బుద్దలా మారిపోయావు.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
August 14, 2025