ఆ
 టీజర్‌లో రామ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. రామ్ చెప్పిన ‘‘మీరు 
దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదు’’ డైలాగ్ సినిమా ఎంత 
మాస్‌గా ఉంటుందో చెప్పేలా ఉంది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించని 
రేంజ్ మాస్ యాంగిల్ లో బోయపాటి శ్రీను చూపించినట్టు గా అర్థం అవుతుంది. 
గుబురు గెడ్డం తో లావుగా చాలా కొత్తగా ఇందులో రామ్ కనిపిస్తున్నాడు. 
బాలయ్య బాబు తో తప్ప కుర్ర హీరోలతో సక్సెస్ రేట్ తక్కువ ఉన్న బోయపాటి 
శ్రీను, ఈ చిత్రం తో తాను కుర్ర హీరోలతో కూడా సూపర్ హిట్స్ తియ్యగలను అని
 నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. అందుకే రామ్ లాంటి మాస్ హీరోను 
ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 
అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేస్తున్నట్లు ఇటీవల మూవీ యూనిట్ 
ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఇది ప్రేక్షకుల ముందుకు 
రానుంది. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ కానున్నట్లు 
తెలుస్తోంది. ఈ సినిమాతో రామ్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి 
అడుగుపెట్టనున్నాడు. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో
 నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ఇదిలా ఉండగా, ‘స్కంద’ 
పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించనున్నాడు.  
‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఈ సినిమా 
తెరకెక్కనుంది. పాన్ ఇండియా మూవీగానే రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి
 8న విడుదలవుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. 

.jpg)