కర్ణాటకలో కాంగ్రెస్ హామీల అమలులో కోతలు !
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక చతికిలబడిరదని బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా చెబుతోంది. అయితే, ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఇచ్చిన హామీలకు కట్టుబడి వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. కర్నాటకలో హామీలను అమలు చేయలేదంటున్న వాళ్లు.. ఒక్కసారి ఆ రాష్ట్రానికి వస్తే పథకాలు నడుస్తున్నాయో లేదో చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. పైగా ఆరు గ్యారెంటీలను రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఇచ్చామని బలంగా చెబుతున్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం పెద్ద కష్టమేం కాదంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను తెలంగాణలోనే ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న దానికి కూడా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నట్టే.. రాష్ట్రాల అవసరాలను బట్టి తేడాలు ఉంటాయని కాంగ్రెస్ సమాధానం ఇస్తోంది. నిజానికి కర్నాటక, తెలంగాణకు ఇచ్చిన గ్యారెంటీలలో మహిళలకు ఆర్థిక సాయం, బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కామన్‌గా ఉన్నవే. రైతులకు పెట్టుబడి సాయం, పెన్షన్ పెంపు మాత్రం తెలంగాణ పరిస్థితులకు తగ్గుట్టుగా డిజైన్ చేశారు. ఇదే విషయాన్ని మున్ముందు మరింత బలంగా చెప్పేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.ఒకప్పుడు మితిమీరిన అప్పులు చేయకూడదన్న స్పృహ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేవి. అందుకే, హామీల అమలులో కాంప్రమైజ్ అయ్యేవారు. కాని, దేశంలో ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంత అప్పు చేసైనా సరే.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే అనుకుంటున్నాయి పార్టీలు. తమిళనాడు, కర్నాటక, పంజాబ్, ఏపీ రాష్ట్రాలే తెలంగాణ కాంగ్రెస్‌కు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా అప్పు చేస్తే తప్పేముందన్న ఆలోచనతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో హామీలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. తెలంగాణకు వచ్చే ఆదాయం, ఏటా ఉండే అప్పుల పరిమితిని చూసే ఆరు గ్యారెంటీలు ఇచ్చారని చెబుతున్నారు. పైగా కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిధుల కోసం కష్టపడుతున్నా సరే.. హామీలను అమలు చేస్తోంది. అయినా సరే.. ఇన్ని హామీలు అమలు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్న వారికి కాంగ్రెస్ ఒక్కటే సమాధానం చెబుతోంది. పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని విమర్శించిన రాష్ట్రాల్లో.. కిందామీదా పడైనా సరే ప్రామిస్‌ను నెరవేరుస్తున్నాయి. దాన్నే పర్ఫెక్ట్ ప్లాన్‌తో అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. ఇప్పటికైతే.. దేనికి ఎంత ఖర్చవుతుందనే లెక్కలు చెప్పకపోయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లెక్కగట్టిన తరువాతే హామీలు ఇచ్చామని చెబుతోంది. అధికారం కోసం రెండుసార్లు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్.. ఈసారి చావోరేవో తేల్చుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఆరు గ్యారెంటీలు అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే, మూడోసారి అధికారం నిలబెట్టుకోవడం కోసం కూడా బీఆర్‌ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికైతే ఉన్న పథకాలనే మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది.
మేలుకో తెలంగాణ...ఎలుకో తెలంగాణ.
అధికారమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెడుతున్న పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అవే ఫేసులు లేదంటే వారి వారసులు, ఈ పార్టీ కాకపోతే మరోపార్టీ...ఎక్కడ చూపిన వారే నాయకులు. మరి తెలివైన యువతకు, నిస్వార్థంగా పనిచేసే సామాన్యులకు అదలం ఎప్పుడు ? వారికి అందని ద్రాక్షేనా ? కులస్వామ్యం, వారసత్వం క్రింత ఇన్ని ఎన్ని రోజులు మగ్గిపోవాలి తెలంగాణ సమాజం. ఎప్పుడు మేల్కొంటుంది నవ తెలంగాణ ప్రజ. ఓటేసి వాడు స్కామ్‌లు చేస్తున్నాడు, వీడు స్కాములు చేస్తున్నాడు అని మొత్తుకునే బదులు ముందుగానే నిజాయితీ గల నాయకులును గుర్తించిఓటేస్తేనే ప్రజాస్వామ్యానికి మేలు కలుగుతుంది. ఉదాహరణకి తీసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమ నాయకులు కోదండరామ్, ప్రజల పక్షాన పోరాడుతున్న తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఉద్యమం కోసం నిస్వార్థంగా పోరాడిన ఎందరో యువనాయకులను గుర్తించి వారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది.