ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యాడ్ . హారికా అండ్ హాసినీ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కూతురు హారిక ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా పరిచయమవుతోంది. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే..కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గొడవలు, ర్యాగింగ్, ఫ్రెండ్‌షిప్, లవ్ లాంటి అంశాల చుట్టూ తిరిగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. లేటెస్ట్‌గా ఈ మూవీ మ్యాడ్ గ్యాంగ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ.. మ్యాడ్ నవ్వించే ఒక మెడిసిన్..జాతిరత్నాలు ఎంతలా మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిందో..మ్యాడ్ మూవీ లో కూడా అంతే నవ్విస్తుంది. ఈ సినిమా జాతీరత్నాలు కంటే ఒక్క క్షణమైనా మిమ్మల్ని తక్కువ ఎంటర్ టైన్ చేస్తే..మాత్రం ట్విట్టర్ లో ఒక్క మెసేజ్ చేయండి.. మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అంటూ తెలిపారు. నాగవంశీ టికెట్ డబ్బులు ఇచ్చేంత కాన్ఫిడెంట్ తో ఉన్నాడంటే..ఇక ఈ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. దీంతో మ్యాడ్ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే
శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాతో నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడనే సంగతి తెలిసిందే. ఇక ఈ ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే మ్యాడ్ మూవీ వస్తుండటంతో..నార్నే నితిన్ పై ఫోకస్ పడిరది. ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నార్నేనితిన్ మరో మూవీ చేయబోతున్నాడు. మ్యాడ్ మూవీని ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెజెంట్ చేస్తుండగా..త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.