TPCC LIST : కాంగ్రెస్‌ ఎమ్మేల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన !

0

అనేక చర్చలు.. వరుస సమావేశాల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఈ జాబితాలో పలు సామాజిక వర్గాలకు కీలక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్లాష్‌ సర్వేలలో మెరుగ్గా ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చినట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుపు గుర్రాలకు అవకాశాలు ఇస్తూనే, కొత్తగా చేరిన వారికి కూడా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కన్ఫర్మ్‌ చేసింది. మెదక్‌ నుంచి మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్‌ కు టికెట్‌ ఓకే చేసింది. మాల్కాజ్‌ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్‌ ఇచ్చింది.. ఇక ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తో పాటు ఆయన సతీమణి పద్మావతికి కూడా అవకాశం ఇచ్చింది.

జాబితా ఇదే

బెల్లంపల్లి స్థానాన్ని గడ్డం వినోద్‌ కు కేటాయించింది. మంచిర్యాల టికెట్‌ ను కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావుకు ఖరారు చేసింది. నిర్మల్‌ స్థానాన్ని కుచడి శ్రీనివాసరావు, ఆర్మూరు స్థానాన్ని ప్రొద్దుటూరు వినయ్‌ కుమార్‌ రెడ్డి, బోధన్‌ స్థానాన్ని సుదర్శన్‌ రెడ్డి, బాల్కొండ స్థానాన్ని ముత్యాల సునీల్‌ కుమార్‌, జగిత్యాల ను జీవన్‌ కుమార్‌ రెడ్డి, ధర్మపురిని అట్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రామగుండం స్థానాన్ని రాజ్‌ ఠాకూర్‌, మంథని స్థానాన్ని శ్రీధర్‌ బాబుకు, పెద్దపల్లి స్థానాన్ని విజయ రమణ రావుకు, వేములవాడను ఆది శ్రీనివాస్‌, మానకొండూరును కవంపల్లి సత్యనారాయణకు, మెదక్‌ ను మైనంపల్లి రోహిత్‌ రావుకు, ఆందోల్‌ స్థానాన్ని దామోదర్‌ రాజనర్సింహకు, జహీరాబాద్‌ స్థానాన్ని ఆగం చంద్రశేఖర్‌ కు, సంగారెడ్డి స్థానాన్ని జగ్గారెడ్డికి, గజ్వేల్‌ స్థానాన్ని నర్సారెడ్డికి, మేడ్చల్‌ ను తోటకూర వర్జస్‌ యాదవ్‌ కు, మల్కాజ్‌ గిరి స్థానాన్ని మైనంపల్లి హనుమంతరావుకు, కుత్బుల్లాపూర్‌ స్థానాన్ని కోలన్‌ హనుమంత్‌ రెడ్డికి, ఉప్పల్‌ స్థానాన్ని పరమేశ్వర్‌ రెడ్డికి, చేవెళ్ల స్థానాన్ని పమేలా భీమ్‌ భారత్‌ కు, వికారాబాద్‌ స్థానాన్ని గడ్డం ప్రసాద్‌ కు, ముషీరాబాద్‌ స్థానాన్ని అంజన్‌ కుమార్‌ యాదవ్‌ మందాడికి, మలక్‌ పేట్‌ స్థానాన్ని షేక్‌ అక్బర్‌ కు, సనత్‌ నగర్‌ స్థానాన్ని డాక్టర్‌ కోట నీలిమకు, నాంపల్లి స్థానాన్ని మహమ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌ కు, కార్వాన్‌ స్థానాన్ని ఉస్మాన్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ హజ్రికి, గోషా మహల్‌ స్థానాన్ని మొగిలి సునీతకు, యాకత్‌ పూర స్థానాన్ని రవి రాజుకు, బహదూర్‌ పూర స్థానాన్ని రాజేష్‌ కుమార్‌ పులిపాటికి, సికింద్రాబాద్‌ స్థానాన్ని ఆడం సంతోష్‌ కుమార్‌ కు, కొడంగల్‌ ను అనుముల రేవంత్‌ రెడ్డికి, గద్వాల స్థానాన్ని సరిత తిరుపతయ్యకు, అలంపూర్‌ స్థానాన్ని డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ కు, నాగర్‌ కర్నూల్‌ స్థానాన్ని డాక్టర్‌ కూచాకుల్లా రాజేశ్వర్‌ రెడ్డికి, అచ్చంపేట స్థానాన్ని చిక్కుడు వంశీకృష్ణకు, కల్వకుర్తి స్థానాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి కి, షాద్‌ నగర్‌ స్థానాన్ని శంకరయ్యకు, కొల్లాపూర్‌ స్థానాన్ని జూపల్లి కృష్ణారావుకు, నాగార్జునసాగర్‌ స్థానాన్ని కొందూరు జానారెడ్డి కుమారుడు జైవీర్‌ రెడ్డికి, హుజూర్‌ నగర్‌ స్థానాన్ని నల్లమడ ఉత్తంకుమార్‌ రెడ్డికి, కోదాడ నలమాడ పద్మావతి రెడ్డి, నల్లగొండ స్థానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్‌ స్థానాన్ని వేముల వీరేశం, ఆలేరు స్థానాన్ని బీర్ల ఐలయ్యకు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాన్ని సింగపూర్‌ ఇందిరకు, నర్సంపేట స్థానాన్ని దొంతి మాధవరెడ్డికి, భూపాలపల్లి స్థానాన్ని గండ్ర సత్యనారాయణ రావుకు, ములుగు స్థానాన్ని సీతక్కకు, మధిర స్థానాన్ని భట్టి విక్రమార్కకు, భద్రాచలం స్థానాన్ని పోదెం వీరయ్యకు కాంగ్రెస్‌ పార్టీ కేటాయించింది. కాంగ్రెస్‌ మొదటి జాబితాలో 12 మంది ఎస్సీలకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు కేటాయించింది. 16 మంది రెడ్లకు టికెట్లు మంజూరు చేసింది. ఇక టికెట్లు కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో ప్రకటించే రోజే కాంగ్రెస్‌ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా తొలి జాబితాను విడుదల చేయడం విశేషం. వెలమ సామాజిక వర్గం వారికి కూడా కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు కేటాయించింది. కొంత మంది కీలక నాయకులకు పార్టీ టికెట్లు ఇంకా కన్ఫర్మ్‌ చేయలేదు. ఆ జాబితాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా ఉన్నారు. మలి విడతలో వీరికి టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భగ్గుమన్న అసంతృప్తి ! 

కాంగ్రెస్‌ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. టికెట్ల రేసులో భంగపడ్డ ఆశావహులు, మద్దతుదారులు కోపోద్రిక్తులయ్యారు. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ పలుచోట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాతబస్తీకి చెందిన మైనార్టీ నేతలతోపాటు గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడిరచారు. గద్వాల కార్యకర్తలు గాంధీభవన్‌ లోపలి గేటు కు తాళం వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది. మేడ్చల్‌, ఉప్పల్‌, కొల్లాపూర్‌ తదితర నియోజకవర్గాల్లోనూ అసంతృప్త సెగలు ఎగిసిపడ్డాయి. రేవంత్‌ కబంధహస్తాల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. పలు నియోజకవర్గాల్లోని కీలకనేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. సగం కంటే తక్కువ స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తేనే ఈ స్థాయిలో రచ్చ జరిగితే ఇక మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదలైతే పరిస్థితి ఇంకెలా ఉండేదోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !