మారిన మన ఆహారపు (Food Habbits) అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య (Health issues) సమస్యలు మనల్ని చుట్టు ముడుతున్నాయి. దీంతో అనారోగ్య సమస్యల బారి నుండి తమను తాము కాపాడుకోవాడానికి చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. చక్కటి పౌష్టికాహారాన్ని, నూనె లేని (Oil free) ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా మనలో చాలా మంది ఉదయాన్నే మొలకెత్తిన గింజలను (Sprouts) ఆహారంగా తీసుకుంటున్నారు. ఉదయం అల్పాహారంలో ( Tiffen ) భాగంగా లేదా స్నాక్స్‌గా ( Snacks) వీటిని తీసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వైద్యులు ( Doctors) కూడా వీటిని ఆహారంగా తీసుకోమని సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజలను ( Sprounts )ఎందుకు ఆహారంగా తీసుకోవాలి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు సమస్య నుండి బయటపడవచ్చు
మొలకెత్తిన గింజల్లలో పోషకాలు సాధారణం కంటే అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో ఉండే అవయవాలకు రక్తం మరియు ఆక్సిజన్ యొక్క సరఫరా సక్రమంగా జరుగుతుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరం శుభ్రపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు అనేక రకాల పోషకాలు కూడా లభిస్తాయి. ప్రోటీన్ లోపంతో పాటు పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా మొలకెత్తిన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయని ప్రతి ఒక్కరు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.