Minister Uttam : మేడిగడ్డ పిల్లర్లు కుంగటం తీవ్రమైన అంశం !

0

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై రాష్ట్ర ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరిగేషన్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇవాళ ఉత్తమ్‌ తొలిసారి హైదరాబాద్‌లోని జలసౌధకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఈఎన్సీ మురళీధరతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా మంత్రి ఉత్తమ్‌ సమీక్ష చేశారు. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్‌ వినియోగంపై మంత్రి ఆరా తీశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులపై లోతుగా సమీక్ష జరిపారు. ఈ శాఖకు సంబంధించిన అధికారులతో మంత్రి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇరిగేషన్‌పై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

మేడిగడ్డ విషయంలో విచారణ జరగాలి.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై విచారణ జరగాలని అన్నారు. బ్యారేజీ పిల్లర్లు కుంగటం అనేది చాలా తీవ్రమైన అంశంమని.. మేడిగడ్డ బ్యారేజ్‌ సందర్శనకు వెళ్లేందుకు టూర్‌ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ నిర్మించిన ఏజెన్సీ, అధికారులు తనతో పాటు ఉండాలని ఆదేశించారు. మేడిగడ్డ విషయంలో విచారణ జరగాలి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలని.. ఎంత ఆయకట్టుకు నీరు ఇచ్చేలా బ్యారేజీ నిర్మాణం జరిగిందో చెప్పాలని అన్నారు. ఒక్కో ఎకరాకు సాగు నీరు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతోందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి.తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాలి. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలి’ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !