CM JAGAN : కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయలేదు !

0

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పర్యటించిన ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. కుప్పాన్ని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి తన జోహార్లు అంటూ వ్యాఖ్యానించారు. కుప్పంలో 87 వేల కుటుంబాలు ఉండగా 82 వేల కుటుంబాలు తమ ప్రభుత్వ పథకాలు అందుకున్నాయని తెలిపారు. కుప్పం ప్రజలందరూ బ్యాంకులు వెళ్లి ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకోవాలని చెప్పారు. కుప్పంలో మరో 15 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయలేని వ్యకి వల్ల ఏం ప్రయోజనం ఉందన్నారు. తనకు లాభాలు తెచ్చే పనులు మాత్రమే చంద్రబాబు చేస్తారని.. తాను మాత్రం కుప్పం ప్రజలకు చాలా మేలు చేశానని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు చాలా ఇచ్చారని.. మరి ఆయన ఏం చేశారని సీఎం జగన్‌ ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థి భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

బాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా ? 

కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా?. చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేదు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా?. మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు?. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి. రంగాను హత్య చేయించింది చంద్రబాబే కదా. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తరఫున భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి. భరత్‌ గెలిచిన తర్వాత మంత్రి చేస్తాం. కుప్పాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు. సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసింది. కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టాం. అందుకోసం పరిపాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చాం. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతాం. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కుప్పంకు సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తున్నాం. 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. 

బాబు లాభాలు ఉన్న పనులు మాత్రమే చేస్తారు.

ఈ 35 ఏళ్ల కాలంలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయలేకపోయారు. కుప్పంకు ప్రయోజనంలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నిధులు పారే ప్రాజెక్ట్‌గా చేసుకున్నారు. ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు. వెల్లూరు మెడికల్‌ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా చేసింది చంద్రబాబు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందించాం. కుప్పం ప్రజలంతా మావాళ్లేనని గర్వంగా చెబుతున్నాను. చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడు నన్ను, సీమను తిడుతూ ఉంటాడు. నేను ఏనాడు కుప్పంను, ఇక్కడి ప్రజలను ఒక్క మాట కూడా అనలేదు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం. ప్రతీనెలా ఇంటికే వచ్చి వలంటీర్లు పెన్షన్‌ అందిస్తున్నారు. చంద్రబాబు హయంలో అరకొర ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు ప్రతీ విద్యార్థికి వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్‌ అవకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు?’ అని ప్రశ్నించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !