తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేసీఆర్ సర్కారు మిమ్మల్ని జైలులో వేసినందుకు రివేంజ్ తీసుకుంటున్నారా అని యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రివేంజ్ ఇంకా స్టార్టే చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తరచూ అంటున్నారు సింహం లోపల ఉంది బయటకు వస్తుంది అప్పుడు చూడండి అంటున్నారుగా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. రమ్మనండి పిస్టోల్‌తో రెడీగా ఉన్నాం.. ఒక్క తూటాతో అయిపోతుంది అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పిల్లిలు, కుక్కలను చంపనని.. చంపితే సింహాన్నే చంపుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్ టార్గెట్ కేసీఆర్ నా ?
ఓటుకు నోటు కేసులో ఇరికించి జైలుకు పంపిన వారిపై రివేంజ్ తీర్చుకునేందుకు రేవంత్ రెడ్డి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు టాక్ షో మాటలను బట్టి అర్థం అవుతోంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతితో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ సాక్ష్యాల కోసం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతోంది రేవంత్ ప్రభుత్వం. పక్కా ఆధారాలు దొరికితే ఇక అంతే, కేసీఆర్‌ని జైలుకు పంపాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి కేసీఆర్ ఏ కేసులో దొరుకుతారో.
AAP KI ADALAT with Rajat Sharma ji tmrw at 10 PM on INDIA TV. #AapKiAdalat #IndiaTV pic.twitter.com/CD80MBeZFP
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2024