AP Land Titling Act తో జనంలో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత !

0

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో భారీ నష్టం జరగబోతోంది అంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రచారం జనంలోకి బలంగా దూసుకెళ్ళింది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొత్త చట్టం ప్రకారం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అముల చేస్తే మీ భూమి మీది కాదు, ప్రభుత్వానిది, మీ భూమిని జగన్‌ లాగేసుకుంటాడు. మీ భూమి మీదే అని మీరే మళ్ళీ నిరూపించుకోవాలి ? ఈ ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ద హక్కుల నిర్ణయం అధికారులకి అప్పగించింది ప్రభుత్వం. కానీ ఇక్కడ పైకి కనిపించేంది అధికారులైనా వారి ముసుగులో పెత్తనం చెలాయించేది ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలే. దీంతో ఇప్పడు ప్రజల్లో భయం పట్టుకుంది. జగన్‌కి ఓటేస్తే భూమి పోతుంది అంటూ జనంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములు, గవర్నమెంట్‌ ఆఫీసులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇకపై ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల భూమి మీద అప్పులు తెచ్చుకునేందుకు ఈ యాక్ట్‌ తెచ్చింది అనే  ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు, భూమి కలిగిన వారు బెంబేలెత్తుతున్నారు. మరో వైపు రైతుల పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మ వేయించుకోవటంపై బహిరంగంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది అవసరమైన సమయంతో భూమి పాసు పుస్తకాలను బ్యాంకుల్లో లేదా ఇతర ప్రైవేటు వ్యక్తుల దగ్గర తనఖా పెట్టుకుని డబ్బు సర్థుబాబు చేసుకునే వీలు లేకుండాపోతుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిరాక్స్‌ కాపీలతో ఎవరూ అప్పులు ఇవ్వకపోతే ఎలా జీవించాలి. దీంతో పెద్ద ఎత్తున ప్రచారం చాపక్రింద నీరులా విస్తరిస్తోంది. దీంతో భారీ ఎత్తున నష్టం జరగబోతోంది అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు !

ఏపీ టైటిల్‌ చట్ట రూపకల్పనలో జగన్‌ సర్కారు పలు విషయాలను విస్మరించింది. నీతి ఆయోగ్‌ కీలక సూచనలను తుంగలో తొక్కింది. దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ముందు అనుసరించాల్సిన విధానాలను పక్కనపెట్టింది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో), ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ అధికారులను (ఎల్‌టీఏవో) నియమించకుండా వైసీపీప్రభుత్వం 2023 అక్టోబర్‌ 31 నుంచి ఈ చట్టాన్ని హడావుడిగా అమల్లోకి తీసుకొస్తూ జీవో జారీచేసింది. ప్రభుత్వ హడావుడి చూస్తే.. అసలు ఉద్దేశమేంటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. భూ యాజమాన్య హక్కులను తేల్చే అధికారాన్ని సివిల్‌ కోర్టుల పరిధి నుంచి తొలగించి.. అధికారులకు అప్పగించినప్పుడే ప్రజల స్థిరాస్తులకు ప్రమాదం పొంచి ఉందనే విషయం తేటతెల్లమైంది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు చేయడం శాసనవ్యవస్థ పని. వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపై ఉంటుంది. టైటిలింగ్‌ చట్టం అందుకు భిన్నం. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారుల చేతుల్లోపెట్టి.. వాటిని కబ్జా చేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే భూ రీ సర్వేలు నిర్వహించి.. విస్తీర్ణాన్ని ‘కుదించి’ హక్కు పత్రాలు ఇవ్వడం మొదలెట్టారు. అవి జగన్‌ సొంత ఆస్తులన్నట్లు హద్దు రాళ్లపై, హక్కు పత్రాలపై ఆయన బొమ్మను ముద్రిస్తున్నారు.  సర్వేయర్లు విస్తీర్ణాలను తగ్గించి చూపడం వల్ల భూయజమానులు, రైతులు ఇప్పటికే అందోళన చెందుతున్నారు. ఎప్పటి నుంచో ఉన్న రికార్డులను కాదని.. ఇవేం తలనొప్పులని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వివాదాల రిజిస్టర్‌ (డిస్ప్యూట్‌ రిజిస్ట్రర్‌) నిర్వహణను దొడ్డిదారిలో ప్రారంభించారు. దీంతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త అవరోధాలను కల్పిస్తున్నారు. గిట్టనివాళ్లు వివాదాన్ని లేవనెత్తేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వాళ్లిచ్చిన వినతులు, దరఖాస్తును ఆధారం చేసుకొని డిస్ప్యూట్‌ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తూ ఆస్తులను వివాదాస్పదంగా మారుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయి నిజమైన భూ యజమాని ఇబ్బంది పడుతున్నారు. తనే యజమాని అని నిరూపించుకునేందుకు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ అధికారి, హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !