N Convention : నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చిన హైడ్రా ! నెక్ట్‌ ఎవరు ?

0

అక్కినేని నాగార్జునకి ఊహించని పరిణామం ఎదురైంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో దూకుడుని ప్రదర్శిస్తున్న హైడ్రా, మాదాపూర్‌ లోని నాగార్జునకి చెందిన ఎన్‌ కన్వెషన్‌ సెంటర్‌ ని కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా ఈ కార్యక్రమం చేపడుతోంది. గతంలో నాగార్జున ఇక్కడ మూడున్నర ఎకరాల తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ ని నిర్మించినట్టు తెలుస్తుంది.ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని... ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా... నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే.. కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ.. హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా... ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. 

ఎన్‌ కన్వెన్షన్‌ వివరాలు...

ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌..హైదరాబాద్‌ మాదాపూర్‌ సమీపంలోని తుమ్మడికుంట ప్రాంతంలో ఉంది. ఇది టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. 2010లో ఎన్‌.కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారు. ఈ ఎన్‌.కన్వెన్షన్‌ తుమ్మిడి చెరువును ఆనుకునే ఉంటుంది. తుమ్మిడి చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారు. ఇందులో రెండు ఎకరాలు బఫర్‌ జోన్‌ ఉండగా... మరో 1.12 ఎకరాలు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌.టి.ఎల్‌) చెరువు శిఖం కిందకు వస్తుంది. చెరువును ఎవరూ ఆక్రమించకుండా... రెండు ఎకరాలను బఫర్‌ జోన్‌గా పెడతారు. కానీ.. నిర్వహాకులు ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించినట్టు తెలుస్తోంది. చెరువుగట్టుపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ... ఎన్‌ కన్వెన్షన్‌ ఏకంగా చెరువలోనే నిర్మించారు. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లోని డైనింగ్‌ హాల్‌ గోడ.. చెరువుకు ఆనుకునే ఉంటుంది. అంటే... చెరువుకు అడ్డుకట్టగా.. ఆ గోట కట్టారని స్పష్టంగా తెలుస్తోంది. 

ఎన్‌ కన్వెన్షన్‌ లోపల ఎలా ఉండేదంటే..

మాదాపూర్‌లోని ఎన్‌. కన్వెన్షన్‌ సెంటర్‌... సెలబ్రిటీల స్టైల్‌లో తమ వివాహాన్ని జరుపుకోవాలనుకునే జంటలకు మంచి వివాహ వేదిక. చెరువు అంచున ఉన్న ఈ సెంటర్‌లో అద్భుతమైన ఇంటీరియర్స్‌, ఆకట్టుకునే ప్రదేశాలు, రాచరిక వివాహ అనుభవం కోసం అత్యాధునిక సౌకర్యాలు ఉండేవి. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ప్రముఖులు.. ఇందులో వివాహ మహోత్సవాలు జరుపుకునేవారు.

ఎన్‌ కన్వెన్షన్‌ ఎందుకు కూల్చివేశారంటే... 

ఎన్‌ కన్వెన్షన్‌ను మాదాపూర్‌లో 10 ఎకరాల్లో నిర్మించారు. అయితే.. ఆ నిర్మాణం.. తుమ్మడికుంట చెరువుకు ఆనుకుని ఉంటుంది. దాదాపు 29 ఎకరాల్లో తమ్మిడి కుంట చెరువు ఉంటుంది. ఈ చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల 30 గుంటల  భూమిని ఎన్‌.కన్వెన్షన్‌ నిర్వాహకులు ఆక్రమించారని కొన్నేళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ కన్వెన్షన్‌ చెరువెకు 25 మీటర్ల ఎఫ్‌టీఎల్‌ (%ఖీుూ%)లో ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. నింబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో... ఎన్‌.కన్వెన్షన్‌ను  కూల్చివేశారు.


ఎన్‌ కన్వెన్షన్‌పై ఫిర్యాదులు..

తుమ్మిడికుంట చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును కుబ్జా చేసి హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించారు. దీనిపై మా ప్రజలు అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో..లోకాయుక్త కంప్లైంట్‌ నెంబర్‌ 2815/2012/బీ 1గా స్వీకరించి అధికారులకు చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. 2014 జులై 14న చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఎందుకో.. యాక్షన్‌ తీసుకోలేకపోయారు. కేసీఆర్‌ హయాంలో... బుల్డోజర్లు ఎన్‌.కన్వెషన్‌ వరకు వెళ్లి... వెనుదిరిగాయి.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి... ఎన్‌.కన్వెషన్‌ జోలికి పోలేదు. ప్రభుత్వ భూములు, బఫర్‌ జోన్స్‌, ఎఫ్‌.టి.ఎల్‌ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఇప్పుడు ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలోనే.. ఇటీవల  కేటీఆర్‌కు చెందినది అని చెప్తున్న జన్వాడ ఫామ్‌హౌస్‌కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్‌.కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. 

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సతీసమేతంగా అమలతో కలిసి ఆయన వద్దకి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేసాడు నాగార్జున. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ఈ ఎన్‌ కన్వెషన్‌ గురించి చర్చకి వచ్చిందో లేదో తెలియదు కానీ, సోషల్‌ మీడియా లో నాగార్జున రేవంత్‌ రెడ్డి ని కలవడానికి ముఖ్య కారణం తన అక్రమ కట్టడాలను కాపాడుకోవడం కోసమే అని అప్పట్లో ఒక టాక్‌ నడిచింది. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఈరోజు జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియా లో సెన్సేషనల్‌ టాపిక్‌ గా నిల్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా నాగార్జున ఆస్తులపై ఆరోపణలు వచ్చాయి. కొన్ని కట్టడాలను ఆ ప్రభుత్వం కూడా కూల్చేసింది. నాగార్జున ఉద్దేశపూర్వకంగా ఆక్రమించి ఈ కట్టడాలను కట్టించి ఉండకపోవచ్చు కానీ, ఆయనకి ఈ స్థలాలు అమ్మిన వారు మాత్రం అన్నీ తెలిసే చేసి ఉండొచ్చు అని నాగార్జున అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక అక్కినేని నాగార్జున ప్రస్తుత కెరీర్‌ విషయానికి వస్తే, త్వరలోనే ఆయన స్టార్‌ మా ఛానల్‌ లో టెలికాస్ట్‌ కాబోతున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌ కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. సెప్టెంబర్‌ 1 వ తారీఖు నుండి ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన మార్కెట్‌ బాగా పడిపోయింది. ఆఫీసర్‌ చిత్రం నుండి వరుసగా డిజాస్టర్‌ ఫ్లాప్స్‌ రావడం, ఆ ఫ్లాప్‌ చిత్రాలు కనీసం 10 కోట్ల రూపాయిల షేర్‌ వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం, అభిమానులకు తీవ్రమైన నిరాశ కలిగించాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది కానీ, నాగార్జున రేంజ్‌ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్‌ కూడా మరో హీరోగా నటిస్తుండగా, రష్మిక హీరోయిన్‌ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !