టీచర్ జాబ్ కోసం పురిటి నొప్పుల్ని భరించిన ధీరవనిత

0

ఉపాధ్యాయ ఉద్యోగం ఆమె లక్ష్యం. అందుకు పురిటి నొప్పులను కూడా భరించింది. జీవిత ఆశయాన్ని సాధించేందుకు  ప్రాణాల్ని పణంగా పెట్టింది. చివరకు ఎగ్జామ్‌ పూర్తి చేసింది.

జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఆమె పురిటి నొప్పులను కూడా ఓర్చుకుంది. నెలలు నిండిన బిడ్డను కడుపులో మోస్తూనే పోటీ పరీక్షలకు హాజరైంది. ఉపాధ్యాయురాలిని కావాలనే ఆమె సంకల్పానికి అది సరైన సమయం కాదని తెలిసి కూడా అన్నీ ఇబ్బందులను ఓర్చుకొని ధైర్యంగా నిలబడటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం తెలంగాణవ్యాప్తంగా టెట్‌ పరీక్ష జరిగింది. అయితే సంగారెడ్డిజిల్లా అమీన్‌పూర్ పట్టణంలోని లైఫ్‌లైన్‌ పాఠశాలలో టెట్‌ ఎగ్జామ్ సెంటర్‌లో మాత్రం పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్ది పట్టుదల అందర్ని విస్మయానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే  సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కృష్ణాపూర్‌కి చెందిన కొండబోయిన అర్చన. అర్చన భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ప్రస్తుతం అర్చన నిండు గర్భిణి. అయినప్పటికి ఎగ్జామ్‌ రాయాలని లైఫ్‌లైన్‌ స్కూల్‌లో నిర్వహించిన ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సమయానికే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. వాటిని భరిస్తూనే కొద్ది సమయం వరకు పరీక్ష రాసింది. ఎగ్జామ్‌ సెంటర్‌లో గర్భిణి అర్చన పడుతున్న బాధను అక్కడి అధికారులు గమనించారు.

 విషయాన్ని అమీన్పూర్ తహసీల్దార్‌ విజయకుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి అర్చనను ఆమెను 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అర్చనకు పరీక్షలు నిర్వహించి ఎలాంటి అపాయం లేదని తేల్చి చెప్పారు. ప్రసవం కావడానికి మరో మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని చెప్పారు. అంతే కాదు అర్చనకు నార్మల్ డెలవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. సంగారెడ్డి హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయురాలిని కావాలనే తపనతో పురిటి నొప్పులను సైతం భరిస్తూ ఎగ్జామ్‌ రాసిన అర్చన పట్టుదలను చూసిన డాక్టర్లు, అధికారులు హర్షించారు.  అన్ని ఆర్హతలు ఉండి కేవలం నిర్లక్ష్యంతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వదులుకుంటున్న యువత ఇలాంటి సందర్భాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నెలలు నిండిన గర్భిణి తన కడుపులో బిడ్డ కంటే కూడా టీచర్‌ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం నెలలు నిండి, నొప్పులు వస్తుంటే కూడా పరీక్ష కేంద్రానికి రావడం గొప్ప విషయమని అధికారులు చెబుతున్నారు.మరోవైపు గర్భిణిగా ఉన్న అర్చనను ఎగ్జామ్ సెంటర్ నుంచి సకాలంలో ఆసుపత్రికి చేర్చిన 108 పైలెట్ దేవగౌడ్, ఈఎంటీ ప్రశాంత్‌ను అధికారులు అభినందించారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !