రాష్ట్రపతి ఎన్నికల్లో..ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరు ?

0

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఎంపిక చేసుకున్నాయా ? ఇందుకు ఇతర పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా ? తాజా పరిణామాలు చూస్తే పవార్‌ అభ్యర్థి అవుతారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన్నే అభ్యర్థిగా నిలపాలని ఆప్‌ గట్టిగా భావిస్తోంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముంబైలో పవార్‌తో సమావేశమయ్యారు. అరగంట పాటు మంతనాలు జరిగాయి. ఆయన ఎన్‌డీఏ అభ్యర్థిపై పోటీచేయాలన్నది తమ అభిమతమని ఆప్‌ వర్గాలు తెలిపాయి. దీనిపై పవార్‌, ఎన్‌సీపీ ఇంతవరకు పెదవి విప్పలేదు.

అయితే ప్రతిపక్షాలు తమ అభ్యర్థిత్వంపై ఇంకా ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోకున్నా.. పవార్‌ మాత్రం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రపతి ఎన్నికపై పవార్‌ ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం కావలసి ఉంది. అయితే అనారోగ్యంతో ఆమె ఆస్పత్రిలో చేరడంతో కుదరలేదు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడానికి తాను సానుకూలమని ఆమె రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ద్వారా పవార్‌కు సందేశం పంపారు. దీనికితోడు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు కొన్ని ప్రతిపక్షాలు సుముఖంగా లేవు. కాంగ్రెసేతర అభ్యర్థికైతే ప్రతిపక్షాలన్నీ సహకరించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ నాయకత్వం కూడా ఇందుకు సరేనన్నట్లు తెలిసింది. దీంతో ఆ దిశగా ఆయా పార్టీల నడుమ సమాలోచనలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి పేర్ల పరిశీలన ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. కాగా.. అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈనెల 15న ఢిల్లీలో జరిపే ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాకూడదని సీపీఎం నిర్ణయించింది. అంటే ఆ పార్టీకి చెందిన కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్‌ రానట్లే. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా వచ్చే అవకాశాల్లేవు. కేజ్రీవాల్‌కు 15న పంజాబ్‌లో వేరే సమావేశం ఉంది. ఉద్ధవ్‌ కూడా ఆ సమయంలో అయోధ్యలో ఉంటారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆదివారం తెలిపారు.  కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రతిపక్షాలకు స్నేహహస్తం అందిస్తోంది. ఆయా పార్టీలతో చర్చించే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు, జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పార్టీ నాయకత్వం అప్పగించింది.  




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !