అగ్నిపథ్ మంటలు తెలంగాణను సైతం తాకాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్ళు రువ్వారు. రెండు బోగీలకు నిప్పు అంటించారు. రైల్వేస్టేషన్లో మొదటి మూడు ప్లాట్‌ఫామ్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హౌరా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లతో సహా మరికొన్ని రైళ్ళకు ఆందోళనకారులు నిప్పంటించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీపరీక్షను యథావిధిగా నిర్వహించాలని ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. దీంతో ప్రయాణీకులు భయందోళనకు గురవుతున్నారు. అధికారులు రైళ్ళను నిలిపివేశారు.