ఆయన ఉద్యోగం...జీవితకాలం లేటు !

0

ఉద్యోగం వస్తే అందరికీ అనందమే, అదే ప్రభుత్వ ఉద్యోగమైతే మహదానందం. కానీ 33 ఏళ్ళకు రావలసిన ఉద్యోగం 57 సంవత్సరాలు వస్తే...దీనినే దురదృష్టం అంటారేమో. జీవితాకాలం లేటు అంటే ఇలా ఉంటుందేమో అనిపించేలా ఉంది శ్రీకాకుళం జిల్లా పతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు కథ. పాత సైకిల్‌పై ఓ సంచిలో బనియన్లు, డ్రాయర్లు, చొక్కాలు పెట్టుకుని పాతపట్నం, కొరసవాడ, కాగువాడ గ్రామాల్లో అమ్ముతూ  జీవిస్తున్నాడు. బేరం లేని రోజు పస్తు పడుకోవడం తప్ప మరో దారి లేని ఇతను ఇలా రెండు దశాబ్దాలుగా జీవితం లాక్కొస్తున్నాడు. అరకొర ఆదాయం వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులు అల్లక నీలకంఠు, అమ్మయమ్మలు మృతి చెందారు. ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడే ఇతను 1998 బ్యాచ్‌ డీఎస్సీకి అర్హత సాధించారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పట్లో ఉద్యోగం రాలేదు. తాజాగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో ఆ బ్యాచ్‌లో మిగిలిపోయిన అర్హులకు ఉద్యోగాలొచ్చాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు కేదారేశ్వరరావు చెవిన వేయగా, ఆయన ఆశ్చర్యపోయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !