నిత్యమేనన్‌ పెళ్ళి బాజా ?

0

అందం, అభినయం మెండుగా ఉన్న నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారి జాబితాలో ఎప్పుడూ ఉండే ఒక పేరు నిత్యామీనన్‌. మలయాళీ అయినప్పటికీ.. తెలుగు నేర్చుకొని మరీ, తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకొనే స్థాయికి ఎదిగింది. ‘ అలా...మొదలైంది’’తో తెలుగులో మొదలు పెట్టి...ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించగలిగే స్థాయికి వెళ్ళింది. ముందు నుంచీ గ్లామర్‌ పాత్రలపై ఎలాంటి ఆసక్తి చూపకుండా.. కేవలం తన అభినయానికే మొదటి ప్రాధాన్యతనిచ్చిన ఆ బ్యూటీ తెలుగులో ఎన్నో మెమరబుల్‌ మూవీస్‌లో నటించి ప్రేక్షకుల ఆరాధ్య కథానాయిక అయింది. ఈ ఏడాది పవర్‌ స్టార్‌ ‘భీమ్లా నాయక్‌’ లో పవర్‌ ఫుల్‌ పాత్ర పోషించి అభిమానుల మన్ననలు పొందింది నిత్యామీనన్‌. అలాంటి ఆ నటికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. నిత్యామీనన్‌ త్వరలోనే తన మనసుకు నచ్చిన మలయాళీని పెళ్ళిచేసుకోబోతోందట. ఇప్పుడు ఈ వార్తను విన్న నిత్యామీనన్‌ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె పెళ్ళిచేసుకోబోయే వాడు మలయాళంలో పాపులర్‌ యాక్టర్‌ అని తెలుస్తోంది. ఒక కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఒకరికొకరికి ఏర్పడిన పరిచయం..ఆపై ప్రేమకు దారి తీసిందని, వారి ప్రేమ వ్యవహారం ఇప్పటివరకూ ఎంతో రహస్యంగా కొనసాగిందని మాలీవుడ్‌ మీడియా అంటోంది. అయితే ఆ మలయాళ నటుడు ఎవరన్నది  సీక్రెట్‌గా ఉంచారు.  త్వరలోనే తన పెళ్ళి వార్తను నిత్యామీనన్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేయనుందట. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !