జూనియర్‌ ఎన్టీఆర్‌తో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ఏం మాట్లాడారు ?

0ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌ కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాని కలిసిన విషయం తెలిసిందే,  కేవలం 15 నిమిషాల భేటీపైనే గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది. అదేమిటంటే వారిరువురీ ఏం మాట్లాడుకున్నారు అని. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటనకు ఫిదా అయి జూనియర్‌ ఎన్టీఆర్‌ ని అభినందించడానికి పైకి చెపుతున్నా, అమిత్‌ షా మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌ ని బీజేపీకి సపోర్ట్‌ చెయ్యమని అడిగారని తెలుస్తోంది. తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ఉన్న అన్ని అస్త్రాలను వాడుకునేందుకు సిద్ధమైన అమిత్‌షా...జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెలంగాణలో మాత్రమే సపోర్ట్‌ ఇవ్వమని అడిగారని తెలుస్తోంది. అయితే జూనియర్‌ ఎన్ఠీఆర్‌  మాత్రం అమిత్‌ షా ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి రానని, తన కెరీర్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, ఇంకా కొన్ని సంవత్సరాలు పాటు తాను నటనలోనే కొనసాగుతానని జూనియర్‌ ఎన్ఠీఆర్‌ అమిత్‌ షాకి చెప్పారని సమాచారం. అయితే ఈ భేటీ వెనుక  ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ హస్తం వుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ పార్టీ విజయేంద్ర ప్రసాద్‌ సలహాలు తీసుకొని తెలంగాణాలో తమ పార్టీ అధికారంలోకి వచ్చే అంశం మీదే దృష్టి కేంద్రీకరించిన బీజేపీ, అందుకుగాను విజయేంద్ర ప్రసాద్‌ సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే, రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పుడు పార్టీకి తెలంగాణలో కీలక వ్యక్తులుగా మారనున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !