పార్టీ మారేందుకు రూ. 100 కోట్ల ఆఫర్‌...టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి

0

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంపై ఎమ్మేల్యే రోహిత్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో కీలక వివరాలను పొందుపరిచారు పోలీసులు. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. బీజేపీలో చేరితే రూ.100 కోట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ సివిల్‌ కాంట్రాక్టులను ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారని తెలిపారు. బీజేపీలో చేరకుంటే.. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందని బెదిరించినట్లు పేర్కొన్నారు.

నిందితుల్లో ఇద్దరు నెల రోజుల క్రితమే పైలట్‌ రోహిత్‌ రెడ్డిని కలిసినట్లు వెల్లడిరచారు. రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మ (ఢల్లీి), నందకుమార్‌ (హైదరాబాద్‌) సెప్టెంబరు 26న  పైలట్‌ రోహిత్‌ రెడ్డిని కలిశారు.  టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సివిల్‌ కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పి ప్రలోభ పెట్టారు. ఒకవేళ చేరకుంటే క్రిమినిల్‌ కేసులు పెడతారని, సీబీఐ, ఈడీ దాడులు జరుగుతాయని బెదిరించారు. ఇది అనైతికమని, అప్రజాస్వామికమని పైలట్‌ రోహిత్‌ రెడ్డి భావించారట. అక్టోబరు 26న వారు మరోసారి పైలట్‌ రోహిత్‌ రెడ్డికి కాల్‌ చేశారట. మధ్యాహ్నం మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌కి వస్తామని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేను కూడా తీసుకురావాలని.. వారికి కూడా ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారట. తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరవచ్చని వివరించారు. ఐతే ఈ విషయాన్ని పైలట్‌ రోహిత్‌ రెడ్డి.. ఉదయం 11:30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌ ఏసీపీకి ఫోన్‌ చేసి చెప్పారట. అనంతరం పోలీసులు అప్రమత్తమై.. ఫామ్‌ హౌస్‌పై నిఘా పెట్టారు. ఇక చెప్పినట్లుగానే రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి స్వామి ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. డీల్‌ను ఫైనల్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి.. ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.


ఇక ఫామ్‌హౌస్‌లో పార్క్‌ చేసిన ఉన్న కారులో (టిఎస్‌07 హెచ్‌.యం.2777) రెండు బ్యాగులను పోలీసులు గుర్తించారు. అందులో ఏముందో ఇప్పటి వరకు వెల్లడిరచలేదు. ఈ కారు గంధవరపు దిలీప్‌ కుమారు పేరుతో ఉన్నట్లు పోలీసులు వెల్లడిరచారు. ఆయన ఎవరు? కారు అక్కడ ఎందుకు ఉంది? ఆ బ్యాగ్‌లో ఏమున్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు నిందితులు డబ్బులు కూడా తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ డబ్బును ఎక్కడ దాచారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఉదయం పోలీసులు ఫామ్‌హౌస్‌ మొత్తాన్ని గాలించారు. బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !