ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని చేయాలి. లేదంటే సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం సెలబ్రిటీసే కాదు సామాన్య ప్రజలకు వర్తిస్తుంది. మనం ఒక పని చేస్తున్నాము అంటే దాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని చేస్తే ఏ సమస్య రాదు. మరీ ముఖ్యంగా సమాజంలో పేరున్న వ్యక్తులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్లపై ఎప్పుడు మీడియా ఓ కన్ను వేసే ఉంటుంది. చీమ చిటుకుమన్న సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతున్న రోజులు ఇవి. మరి అలాంటిది స్టార్ హీరోయిన్ పెళ్లయిన నాలుగు నెలలకే తల్లి అయింది అంటే ఊరుకుంటారా..? నానా రచ్చ చేసేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా వీళ్ళ పెళ్ళి అయ్యి నాలుగు నెలలు కంప్లీట్ అయింది అంతే . సోషల్ మీడియా వేదికగా విగ్నేష్ శివన్ ..’’నేన్య్ నయనతార అమ్మ అప్ప అయ్యాము ’’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షేక్ అయింది. పెళ్లైన నాలుగు నెలలకే బిడ్డలు పుట్టడం ఏంటి అది కూడా కవల పిల్లలు అంటూ వ్యంగ్యంగా స్పందించారు. అయితే ఇదంతా సరోగసి ప్రాసెస్ ద్వారానే జరిగింది అన్నట్లు కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. కాగా ఒకవేళ నిజంగా నయన్ విగ్నేష్ సరోగసి ప్రాసెస్ తీసుకున్నట్లయితే దానికి పూర్తి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే సరోగసి ప్రాసెస్ ఇండియాలో బ్యాన్ చేశారు. ఆరోగ్య కారణాలు ఉంటే తప్పిస్తే ఇలాంటి ప్రాసెస్‌కి వెళ్ళకూడదు. మరి నయనతారకు అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా ? ఉంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ? డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయా ? ఒకవేళ చట్టాన్ని మీరి ఈ జంట పిల్లల్ని కన్నట్టయితే వీరికి ఎలాంటి శిక్ష పడనుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.
అద్దె తల్లి ఎవరు ?
తాజాగా కోలీవుడ్ న్యూస్‌లో షాకింగ్ మ్యాటర్ వైరల్ గా మారింది. నయన్ విగ్నేష్ పిల్లలకు అద్దె తల్లిగా ఉన్నది ఎవరో కాదు. నయనతార క్లోజ్ ఫ్రెండ్ అంటూ న్యూస్ చేస్తుంది. అసలు ఈ ప్రాసెస్ మొత్తానికి మూల కారణం నయనతార పెళ్లిలో హడావిడి చేసిన తన చిన్ననాటి స్నేహితురాలు అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇద్దరు ప్రేమించుకున్న టైం లోనే పిల్లలు కనడం ఇష్టం లేదని తన ఫ్రెండ్ కి చెప్పిందట. ఈ క్రమంలోనే సరోగసి ప్రాసెస్ ను ఎక్స్ ప్లైన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడి ఎట్టకేలకు తల్లిదండ్రులు అవ్వడానికి కారణం అయిందట.కాగా నయన్ విగ్నేష్ కెరియర్ని నాశనం చేసింది ఈమె అంటూ ఫ్యాన్స్ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పై మండిపడుతున్నారని కోలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. దీంతో కోలీవుడ్ మీడియా షాక్ అయ్యింది.