అబార్షన్‌ మహిళ హక్కు ` సుప్రీంకోర్ట్‌ సంచలన తీర్పు !

0

అబార్షన్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అవివాహితులే కాదు వివాహితులైన మహిళలందరూ చట్టం ప్రకారం సురక్షితమైన అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉందని అత్యున్నత సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్‌ టర్మినేషన్‌ కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్ళి కాలేదనే కారణంతో అబార్షన్‌ చేసేందుకు నిరాకరించటం సరికాదని స్పష్టం చేసింది. వివాహిత, అవివాహిత, ఒంటరి మహిళలకు 24 వారాల గర్భం వరకు సురక్షిత అబార్షన్‌కు చట్టం వీలు కల్పిస్తోందని ఓ కేసుకు సంబంధించి తీర్పునిచ్చింది.  వివాహితతో భర్త బలవంతంగా శృంగారం చేస్తే...తదనంతర గర్భం వచ్చినా దాన్ని మారిటల్‌ రేప్‌గా పరిగణించి అబార్షన్‌ చేయవచ్చంది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్‌ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్‌ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోందని సుప్రీం పేర్కొంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !