లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఈడీ దూకుడు !

0

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతోంది. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు కవిత అకౌంటెంట్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. కాగా.. నేడు కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. 

హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్‌ అకౌంట్‌ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్‌ ఆడిటర్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్‌ నగర్‌ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్‌ నివాసముంటున్నారు. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. అలాగే.. గచ్చిబౌలిలో అభినవ్‌ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా.. గతంలోనూ ఎమ్మెల్సీ కవిత పీఏగా పనిచేస్తున్న అభిషేక్‌ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

కాగా.. దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఢల్లీి, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్‌ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !