రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని త్రాగటం లాభమా ? నష్టమా ?

0

భారతీయ సనాతన సాంప్రదాయాల్లో ఒక అలవాటు ఉండేది. అది ఏమిటంటే రాత్రి రాగి పాత్రలో నిలువ వుంచి, మరునాడు ఉదయాన్నే ఆ నీరు త్రాగటం. అది ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తుందని భావించటం జరుగుతోంది. అయితే, నేటి ఆధునిక సమాజంలోనూ దీనిని అనుసరిస్తున్న వారు లేకపోలేదు.  చాలా మంది పరిశోధనల ద్వారాను ఈ ప్రక్రియ వలన లాభాలు ఉన్నాయి అంటోంది. దానికి ఉదాహరణే దేశంలోనే పేరొందిన ప్రముఖ కంపెనీ మినరల్‌ వాటర్‌ను కాపర్‌ వాటర్‌ పేరిట అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. రాగి పాత్రలో నిలువ ఉన్న నీటిలో రాగి ధాతువు కరిగి, అది మన శరీరంలోకి శోషింపబడుతుంది. నేటికాలంలో వైరస్‌లు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఫలితంగా రాగి పాత్రలకి డిమాండ్‌ పెరిగింది. రోగనిరోధక శక్తికి రాగికి లింక్‌ ఏమిటి అనుకుంటున్నారా అయితే క్రమం తప్పకుండా దాన్ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకోవాల్సిందే.

కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్‌లు నీటి ద్వారా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. రాగి పాత్రలను ఉపయోగించడం ఎంతో మంచిది. పూర్వకాలంలో నీటిని శుద్ధి చేయడానికి ప్లాంట్లు, వాటర్‌ ఫిల్టర్లు ఉండేవి కావు. మన పూర్వీకులు రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి తాగేవారు. ఈ సీక్రెట్‌ తెలుసుకోవడానికి జరిపిన పరిశోధనలో షాకింగ్‌ విషయాలు తెలిశాయి, రాగిపాత్రలో నీటిని నిల్వ ఉంచటం వలన సూక్ష్మజీవులు నాశనం అవుతాయని తెలుసుకుని ఆశ్చర్య పోయారు. అప్పటినుంచి ఆరోగ్యం కోసం రాగి పాత్రలు ఉపయోగిస్తున్నారు. 

రాగిపాత్రల్లోని నీరు త్రాగటం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే:

రాగి పాత్రల ద్వారా శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రంతా ఆ పాత్రలో నీటిని నిల్వ ఉంచాలి ఉదయం వేళలో తాగాలి. మార్కెట్లో ఇప్పుడు రాగితో తయారుచేసిన బాటిల్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటర్‌ ప్యూరిఫైయర్లు సైతం రాగితోనే వస్తున్నాయి. ఇవీ కొంచెం ఖరీదే కానీ కొంటే మంచిది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నీటిని తాగడం సహకరిస్తుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. చర్మ వ్యాధులు రక్తహీనత సమస్యలు తగ్గించాలంటే రాగి పాత్రలో నీటిని తాగడం మంచిది. కాలేయం మరియు  కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. పోషకాలను శరీరానికి అందించేందుకు సహకరిస్తోంది. అల్సర్లు తగ్గించి జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది.రాగి పాత్రలో నీటికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది. కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !