జెఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల !

0


దేశవ్యాప్తంగా కొలువైన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం తుది కీని విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తాజాగా ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్‌ 1 (బీఈ/బీటెక్‌ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6లక్షల మందికి పైగా అమ్మాయిలు, 6లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్‌ 2 (బీ.ఆర్క్‌/బీ.ప్లానింగ్‌) పరీక్షను 46వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25వేల మంది అబ్బాయిలు, 21వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడిరచారు.

మరోవైపు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్‌టీఏ ఆల్‌ ఇండియా ర్యాంకుల్ని ప్రకటించనుంది. వీరిలో టాప్‌ 2.2లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి Link

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !