అమరావతే రాజధాని...కేంద్రం ప్రకటన !

0


విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని.. ఈ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం ముక్త కంఠంతో చెప్పిందా? అని ఎంపీ విజయసాయి రెడ్డి  ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏపీసీఆర్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు వివరించింది.

ఇదే సందర్భంలో 2020లో ఏపీసీఆర్‌డీఏను రద్దు చేసినట్టుగా, మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిందన్నారు. మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పింది. అనంతరం ఆ బిల్లును వెనక్కి తీసుకుంటూ ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని కొనసాగింపుగా మరొక బిల్లును ముందుకు తీసుకొచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం వివరించింది. కాగా... అమరావతిపై కేంద్ర ప్రకటన గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించినట్లైంది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిరదని... దాన్ని మార్చాలంటే మళ్లీ కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, విభజన చట్టంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో స్పష్టమైంది. దీంతో అమరావతి ని రాజధానిగా మార్చాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే పార్లమెంట్‌లో బిల్లులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా తెలుస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !