Telangana : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల !

0

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఈ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/  https://results.cgg.gov.in/ లో విద్యార్థులు తమ మార్కులను చెక్‌ చేసుకోవచ్చు.

హైలెట్స్‌ 

  • ఫస్ట్‌ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత
  • 2, 87, 261మంది పాసయ్యారు
  • ఫస్ట్‌ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా టాప్‌, మేడ్చల్‌ జిల్లా సెకండ్‌
  • సెకండ్‌ ఇయర్‌లో 64.61 శాతం
  • సెకండ్‌ ఇయర్‌లో 3,22,432 మంది పాస్‌
  • సెకండ్‌ ఇయర్‌లో ములుగు జిల్లా టాప్‌
  • ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలు
  • రేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్‌, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్‌.. దరఖాస్తు చేస్కోవాలి
  • మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !