Telangana : ఇంటర్‌ ఫలితాల్లో చరిత్ర తిరగరాసిన నారాయణ !

0

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ దుమ్మురేపింది. సంచలన విజయాలను ఆవిష్కరించింది. Jr.Inter MPC విభాగంలో ఇంటర్‌ బోర్డ్‌ చరిత్రలోనే అత్యధిక మార్కులు సాధించి 470 మార్కులకు గాను 469 మార్కులతో నారాయణ విద్యార్థి పులిగిళ్ళ జాహ్నవి చరిత్ర సృష్టించింది. అలాగే 468 మార్కులు 74 మంది, 467 మార్కులు 530 మంది, 466 మార్కులు 1102 మంది విద్యార్థులు సాధించారు. అలాగే Sr.Inter MPC విభాగంలో 1000 మార్కులకుగాను 993 వంటి అత్యుత్తమ మార్కులను 3 విద్యార్థులు కైవసం చేసుకున్నారు, అలాగే 992 మార్కులను 10 మంది, 991 మార్కులను 29 మంది, 990 మార్కులను 51 మంది సాధించారు.

Bi.P.C లో నారాయణ హవా !   

అదేవిధంగా Jr.Inter Bi.P.C  విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులను మొత్తం 6 గురు విద్యార్థులు కైవసం చేసుకోగా 437 మార్కులను 32 మంది, 436 మార్కులను 40 మంది, 435 మార్కులను 44 మంది నారాయణ విద్యార్థులు సాధించారు. Sr.Inter Bi.P.C విభాగంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కు 994 సాధించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా॥పి. సింధూర నారాయణ, శరణి నారాయణ పేర్కొన్నారు. 

HPGలో నారాయణ ప్రభంజనం 

అదే విధంగా Jr.Inter HPGలోనూ నారాయణ విజయప్రస్థానం కొనసాగిందని తెలిపారు. 500 మార్కులకు గాను 471 మార్కులు, 470 మార్కులు ఇద్దరు, 469 మార్కులు ఒకరు, 468 మార్కులు 5 గురు, అలాగే Sr.Inter HPG విభాగంలో స్టేట్‌ టాప్‌ మార్కు 984 మార్కులను ఇద్దరు నారాయణ విద్యార్థులు సాధించగా, 983 మార్కులను 6 గురు, 982 మార్కులను ముగ్గురు సాధించారన్నారు. హెచ్‌.పి.జీలో టాప్‌ మార్కులన్నీ నారాయణ విద్యార్థులే కైవసం చేసుకోవటం గమనార్హం. ఈ సందర్భంగా డైరెక్టర్స్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షలు, విద్యార్థుల ఆశయాలు నారాయణ నెరవేరుస్తోందని తెలిపారు. ఇంటర్‌ విద్యకు నారాయణ బెస్ట్‌ ఛాయిస్‌ అని మరోసారి నిరూపించామని తెలిపారు. గత 45 సంవత్సరాలుగా నారాయణ విజయపరంపర అప్రతిహతంగా కొనసాగిస్తున్నామన్నారు. జూనియర్‌ ఇంటర్‌లో ఓవరాల్‌గా 95% పాస్‌ పర్సంటేజ్‌ సాధించగా, సీనియర్‌ ఇంటర్‌లో 94.5 % పాస్‌ పర్సంటేజ్‌ సాధించినట్లు తెలిపారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !