పెట్టుబడిదారులకు ఆంధ్ర స్వర్గధామం !

0

  • జీఐఎస్‌ ముగింపు సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌
  • మూడున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించాం.. కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహణ
  • 378 ఎంవోయూల ద్వారా రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు
  • తద్వారా 6.09 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు.. 


రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు మా ప్రభుత్వ మద్దతు, సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. అభివృద్ధిలో మీది కీలక పాత్ర, అదే సమయంలో పెట్టుబడిదారులతో బంధం మాకు చాలా విలువైనది. రెండు రోజుల ఈ సదస్సు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి అన్ని దారులు తెరిచే ఉన్నాయని ప్రపంచానికి తెలియజేశాం. పారిశ్రామికీకరణ దిశగా ప్రయత్నాలకు రెట్టింపు ప్రోత్సాహాన్నిస్తుంది. ` ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌


ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌ ఓ ఆకర్షణీయ గమ్యస్థానంగానిలుపుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చారు. కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మూడున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించడం తమ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. 

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదిరిన 378 ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడిరచారు. తద్వారా రాష్ట్రంలో 6.09 లక్షల మందికి ఉద్యోగాలు లభించనుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు పరిశ్రమలను స్థాపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023’ రెండో రోజు శనివారం ముగింపు సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా తన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అయిందని చెప్పారు. 378 ఒప్పందాలు.. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు

రెండు రోజుల సదస్సులో రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు కుదిరాయి. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 6,09,868 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఒక్క ఇంధన రంగంలోనే రూ.9,57,112 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 42 అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. దాంతో  1,80,918 మందికి ఉద్యోగాలు వస్తాయి. 

ఐటీ, ఐటీ ఆధారిత రంగాలకు సంబంధించి 82 ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.73,819 కోట్లు. దాంతో 1,40,002 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటక రంగానికి సంబంధించి 117 అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. వాటితో రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాంతో 30,787 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో రోజు సదస్సులో భాగంగా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులతో 286 ఎంఓయూలపై సంతకాలు చేకున్నామన్నారు. వీటి ద్వారా సుమారు 2.09 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !