టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేసాడు. గురూజీని కలవండి, కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వండి, ప్రొడ్యూసర్ అయిపొండి అంటూ వరుస ట్వీట్స్ చేసాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఓ నెటిజన్ బండ్లన్న నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్న ఏం చేయాలి అని ట్వీట్ చేసాడు. దానికి బండ్ల గణేష్.. గురూజీని కలవండి.. భారీ గిఫ్ట్ ఇవ్వండి.. నెరవేరుతుంది అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
అది గురూజీ స్పెషాలిటీ...
ఇక మరో నెటిజన్.. గురూజీ కథలు పూర్తిగా మార్చేస్తాడట అని అడిగాడు. దానికి బదులుగా బండ్ల గణేష్.. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ప్రాణస్నేహితులను కూడా వేరుచేస్తాడు, అది గురూజీ స్పెషాలిటీ అంటూ మరో ట్వీట్ చేసాడు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను గురూజీ అని పిలిస్తారు. బయట ఆయన ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ ను గురూజీ అని సంభోదిస్తారు. కాబట్టి బండ్ల గణేష్ ఈ ట్వీట్స్ త్రివిక్రమ్ ను ఉద్దేశించే చేసాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ మధ్య కూడా ఒక ఫోన్ కాల్‌లో త్రివిక్రమ్ గురించి తప్పుగా మాట్లాడాడు బండ్ల గణేష్. దానికి కారణం పవన్ నుండి బండ్ల గణేష్‌ను దూరం చేయడమే. ఆ కోపంతోనే బండ్ల గణేష్ ఇప్పుడు ఇలా ట్వీట్స్ చేసాడని అర్థమవుతోంది. మరి ఈ ట్వీట్స్‌కు త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023