Karnataka Next CM Siddaramaiah : సిద్దరామయ్యే కర్ణాటక కింగ్‌ !

0

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కానీ, సీఎం అభ్యర్థిని నిర్ణయించుకోలేక ఆ పార్టీ అధిష్టానం తంటాలు పడుతోంది. ఫలితాలు వెల్లడయిన నాటి నుంచి సీఎం పదవికోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ కొనసాగుతుంది. వీరితో పార్టీ అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీ సైతం భేటీ అయ్యారు. కానీ సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంపై క్లారిటీ రాలేదు. నాలుగు రోజుల మేధోమథనం తర్వాత కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్‌ ఖరారు చేసింది. సిద్ధరామయ్యపై ఆ పార్టీ మరోసారి విశ్వాసం పెంచుకుంది. ఆయన పేరును కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమోదించినట్లు  తెలిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. సాయంత్రంలోపే మల్లిఖార్జున ఖర్గే ఓ ప్రకటన చేస్తారని ఢల్లీిలోని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో రాహుల్‌ గాంధీ మంగళవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలోనే సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటిద్దామని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీతో సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఈరోజు విడివిడిగా భేటీ కానున్నారు. తొలుత సిద్ధరామయ్య భేటీ అనంతరం, శివకుమార్‌ రాహుల్‌తో భేటీ కానున్నారు. సిద్ధరామయ్యకే సీఎం పదవి అప్పగించే విషయాన్ని రాహుల్‌ శివకుమార్‌కు స్పష్టం చేస్తారని తెలుస్తోంది. దీనికి గల కారణం, డీకేకు సీఎం పదవి ఇవ్వకపోవటానికి గల కారణాలను రాహుల్‌ శివకుమార్‌ కు తెలియజేస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఉపముఖ్యమంత్రి పదవి విషయంపై శివకుమార్‌ తో రాహుల్‌ చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సిద్ధరామయ్యకు కలిసొచ్చిన అంశాలు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు కర్ణాటక సీఎం పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలిసింది. డీకే శివకుమార్‌ నుంచి సీఎం పదవికోసం గట్టిపోటీ ఎదురైనప్పటికీ అధిష్టానం మాత్రం సీనియర్‌ నేత సిద్ధరామయ్య వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం వరకు మల్లిఖార్జున్‌ ఖర్గే అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు పలు కారణాలు ఉన్నాయి. అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రధాన కారణం. 135 ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 90మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్‌ లో స్పష్టమైనట్లు తెలిసింది. అంతేకాక ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్‌ ఉంది. ఆయన 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతి రహిత పాలన సాగించారన్న పేరుంది. మాస్‌ లీడర్‌ గానూ సిద్దరామయ్యకు పేరుంది. అంతేకాక, సిద్ధరామయ్య అయితే రాబోయే కాలంలో పార్టీలో వర్గవిబేధాలు లేకుండా సాఫీగా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది.

శివకుమార్‌కు అడ్డంకిగా మారిన కేసులు..

డీకే శివకుమార్‌ కు అతనిపై ఉన్న కేసులు సీఎం పదవి అదిరోహించడానికి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. శివకుమార్‌పై పెండిరగ్‌లో 19 కేసులు ఉన్నాయి. 2013- 18 కాలంలో మంత్రిగా ఉన్న శివకుమార్‌.. అనేక అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో ఓసారి శివకుమార్‌ అరెస్టయ్యి విడుదలయ్యారు. దీనికితోడు 135 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతే శివకుమార్‌ కు ఉండటంతో అధిష్టానం సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇచ్చేందుకు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !