జూనియర్ ఎన్టీఆర్ దుబాయిలో ఒక సినిమా వేడుకలో పాల్గొనేందుకు కుటుంబంతో వెళ్ళాడు. అక్కడ నిన్న రాత్రి ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో తను చేసిన పాత్రకి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 వేడుక ఘనంగా జరుగుతోంది. రెండు రోజులు జరగనున్న ఈ వేడుకల్లో నటీనటులు హాజరై సందడి చేస్తున్నారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’లో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి.
‘‘నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్‌కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు - @tarak9999 at #SIIMA pic.twitter.com/qedwWc16sE
— WORLD NTR FANS (@worldNTRfans) September 15, 2023