ప్రజాస్వామ్యం: నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు !! నియంతృత్వం: నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే !!’’ అని దేవ కట్టా తన సోషల్ మీడియా మాధ్యమం వేదికగా ట్వీట్ చేశారు. ఇందులోని అర్థాన్ని నిగూఢంగా పరిశీలిస్తే...ప్రజాస్వామ్యం అనే స్థానంలో చంద్రబాబును ఉంచారు, అంటే చంద్రబాబు : నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు, నియంతృత్వం స్థానంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ధేశించి పెట్టినట్టుగా ఉంది. అంటే జగన్‌మోహన్ రెడ్డి : నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే. అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధం వున్నవాళ్లు, అలాగే చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా అనుబంధం వున్నవాళ్లు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. మొదటి సారి ఒక డైరెక్టర్ ఇన్‌డైరెక్ట్‌గా చంద్రబాబు అరెస్ట్‌ను కళాత్మాకంగా, సృజనాత్మకంగా ఖండిరచే ప్రయత్నం చేశారు. ఆయనే దర్శకుడు దేవ కట్టా. ఈయన ఎక్కువగా సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా తన సినిమాలను తెరకెక్కిస్తారు. తన రెండో సినిమా ‘ప్రస్థానం’ రాజకీయ నేపథ్యంలో తీసి సంచలనం సృష్టించాడు. ఈమధ్య సాయి ధరమ్ తేజ్‌తో దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ అనే సినిమా కూడా ప్రేక్షకులని ఆలోచింపచేసే చిత్రంగా మలిచారు.
Democracy; You are NOT GUILTY until proven GUILTY!!
— deva katta (@devakatta) October 13, 2023
Dictatorship; You are GUILTY until proven NOT GUILTY!!