PavanKalyan : మోదీకి దేశమే ముఖ్యం, ఎన్నికలు కాదు

1 minute read
0

ప్రధాని మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారు. 

అందరికీ అందని పరిస్థితి

సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. జల్‌, జంగల్‌, జమీన్‌ అంటూ కుమురం భీం పోరాడారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమమని.. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి నెలకొందన్నారు. మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్‌ 370, నోట్ల రద్దు చేసేవారు కాదు. రామమందిరం నిర్మించగలిగేవారు కాదు. ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదన్నారు. ఎన్నికలనే మోడీ దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. దేశ ప్రయోజనాలే ప్రధాని మోడీని నిర్ధేశిస్తాయి తప్పు, ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. బీసీలను సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టింది మోడీ అని పవన్‌ వెల్లడిరచారు. 

బీసీ ముఖ్యమంత్రి

నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అంటూ పవన్‌ కళ్యాణ్‌ వెల్లడిరచారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టమన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. బీజేపీకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి అండగా నిలబడతామన్నారు. భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకూడదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉగ్రదాడులు తగ్గిపోయాయన్నారు. మోదీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి. ఆయన మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెం.1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
July 26, 2025