పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న నయనతార

0

దాదాపు ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత తమిళ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలేశ్వరంలో జరిగిన ఈ జంట మ్యారేజ్‌కి భారతీయ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు తారలు హాజరై, వధూవరులని ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే ఈ కపుల్ తిరుపతి వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అయితే.. వీరి పెళ్లి తరువాత రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ షాకింగ్ వార్త ప్రచారం జరుగుతోంది.

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నయన్ వృత్తి జీవితంలో పలుమార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నయన్ తన భర్తవిఘ్నేష్ శివన్‌తో ఎక్కువ సమయం గడపడానికి సినిమాలకు విరామం తీసుకోవాలని భావిస్తుందట. అంతేకాకుండా..ఇప్పటికే కమిట్ అయిన మూవీస్‌లో సైతంసహనటులతో తెరపై రోమాంటిక్ సీన్లలో సైతం నటించకూడదని నిర్ణయించుకుందట. అయితే ఇలాంటి కీలక నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ.. ఈ న్యూస్ నయన్ ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది. ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. ఆమె వైవాహిక జీవితం బాగుండాలని కోరకుంటున్నారు. కాగా.. నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ అనే సినిమా చేస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !