రూ.110 కోట్ల పెట్టుబడులతో విజయ డయాగ్నోస్టిక్‌ విస్తరణ

0

 

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం నాలుగు పెద్ద డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను, పెద్ద కేంద్రానికి అనుసంధానంగా ఉండే 12 కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తోంది. హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నరసింహరాజు తెలిపారు. 

ఇప్పటికే నాలుగు పెద్ద డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తులో కొత్త ప్రాంతాల్లో మరిన్ని హబ్‌లు ఏర్పాటు చేస్తాం. ఒకటి, రెండు హబ్‌లను మినహాయిస్తే.. మిగిలిన వాటిని హైదరాబాద్‌ వెలుపల ప్రారంభించనున్నామని చెప్పారు. సాధారణంగా ఒక్కో హబ్‌ను ఏర్పాటు చేయడానికి రూ.12-13 కోట్లు ఖర్చవుతుంది. పెట్‌-సీటీ వంటి సదుపాయాలకు గిరాకీ ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రంలో ఇటువంటి సదుపాయాలను వినియోగించుకోవడానికి రెండు రోజులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు హబ్‌ల్లో పెట్‌-సీటీ, గామా కెమెరా వంటి ఆధునిక డయాగ్నోస్టిక్‌ సదుపాయాలను ఏర్పా టు చేయాలనుకుంటున్నాం. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4 పెద్ద కేంద్రా లు, 8-10 స్పోక్‌ కేంద్రాలకు రూ.90-110 కోట్ల పెట్టుబడులు పెట్టే వీలుందని తెలిపారు. 

భవితకు ఢోకా లేదు .... ఇటీవలి కాలంలో డయాగ్నోస్టిక్‌ రంగంలో పోటీ పెరిగింది. కొత్త మార్పులు వచ్చాయని విజయ డయాగ్నోస్టిక్‌  సీఈఓ సుప్రితా రెడ్డి అన్నారు. రోగులను ఆకర్షించడానికి కొన్ని సంస్థలు, అగ్రిగేటర్లు భారీ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నారు. అయితే.. ధర కన్నా సేవల నాణ్యత హెల్త్‌కేర్‌ రంగంలో ముఖ్యమని వ్యాఖ్యానించారు.  స్వల్పకాలంలో ఈ ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో డయాగ్నోస్టిక్‌ పరిశ్రమ వృద్ది, విస్తరణ ఆశావహంగానే ఉంటుందని వివరించారు. ఇది విజయా డయాగ్నోస్టిక్స్‌ వంటి సంఘటిత రంగంలోని కంపెనీలకు మేలు చేస్తుంది. మధ్య, దీర్ఘకాలానికి స్థిర వృద్ధి రేటును అంచనా వేయొచ్చని చెప్పారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !