Smitha Sabharwal : ఆమెను కేంద్ర సర్వీసులకు పంపొద్దు - ఎక్కడికీ వెళ్ళటం లేదు !

0

IAS అధికారిని Smitha Sabharwal ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్‌ IAS AKUNURI MURALI తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి  ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంత మంది ఐఏఎస్‌లకు  ఫ్యాషన్‌  అయ్యిందని ట్వీట్‌ చేశారు.  తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి.. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని వ్యాఖ్యానించారు.  దేశంలో  హెలికాఫ్టర్‌ లో వెళ్లి పనులను పర్యవేక్షించే  ఏకైక ఐఏఎస్‌ ఆఫీసర్‌ కూడా ఈమెగారే అంటూ ఆకునూరి మురళీ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్‌ కీలకంగా వ్యవహరించారు.  తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్‌ భగీరథ పనులను పర్యవేక్షించారు. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్‌ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేయడమే ఇందుకు కారణం.  కొత్త ఛాలెంజ్‌ లకు ఎప్పుడూ సిద్దం అంటూ స్మిత ట్వీట్‌ చేశారు .2001లో ట్రైనీ కలెక్టర్‌ ఐఏస్‌ విధుల్లో చేరిన స్మితా సబర్వాల్‌.. మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పనీతీరులో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపును పొందారు. తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. 

ఎక్కడికీ వెళ్ళడం లేదు - స్మిత సభర్వాల్‌

కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ ఖండిరచారు. ఆ వార్తలు అవాస్తవమని ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా ఆమె వెల్లడిరచారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని స్మితా సభర్వాల్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాని ఆమె తెలిపారు. భారాస ప్రభుత్వం అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయంలో స్మితా సభర్వాల్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !