Coronavirus : కరోనా...మరో సిరీస్‌ !

0

చైనాలో తాజాగా నమోదవుతోన్న న్యుమోనియా కేసులు ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్నాయి. న్యూమోనియా మరో పెను ముప్పుగా మారుతోన్న తరుణంలో.. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తాజాగా నమోదవుతోన్న కొత్త కేసులు చూస్తుంటే ఇది నిజమేనని చెబుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్‌లో రోజుకు సగటున మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఐసీయూలో చేరుతోన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక భారత్‌లోనూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. రోజురోజుకీ యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని వారాల క్రితం యాక్టివ్‌ కేసుల సంఖ్య 500 కంటే తక్కువ ఉండగా డిసెంబర్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి.

తీవ్రమైన ముప్పు ఉండదని భరోసా !

ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో మొత్తం 1185 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేవలం గడిచిన 24 గంటల్లోనే 237 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కేసులు కేరళలో నమోదయ్యాయి. అయితే రోగులకు తేలికపాటి లక్షణాలు కనిపించడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంపై ఎపిడెమియాలిజిస్ట్‌ డాక్టర్‌ జుగల్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ విస్తరిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ప్రజలు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నారు. వీరు ఆసుపత్రులకు వెళ్లే సమయంలో అక్కడ కోవిడ్‌ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. దీంతో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. ఇక కేరళలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఇప్పటికీ కోవిడ్‌ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. కరోనా కేసులు సున్నాకు చేరుకోవడం అసాధ్యమన్న డాక్టర్‌ జుగల్‌.. కోవిడ్‌ శాశ్వతంగా ముగుస్తుందని అనుకోవద్దని చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు కేసులు వస్తూనే ఉంటాయి, కానీ ఇప్పుడు మునుపటిలా తీవ్రమైన ముప్పు ఉండదని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోని ఏ దేశంలో కూడా కోవిడ్‌ కొత్త వేరియంట్‌ గుర్తించలేదని డాక్టర్‌ దీపక్‌ సుమన్‌ తెలిపారు. అయితే మారుతోన్న వాతావారణం కారణంగా.. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. అందుకే ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను ధరించడాన్ని ఇంకా కొనసాగించాలని చెబుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !