YSRCP : వైసీపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లు...రెండో జాబితా సిద్ధం !

0


ముఖ్యమంత్రి జగన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణకంగా అభ్యర్దుల విషయంలో అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సీఎం ఏ చిన్న అవకాశం ప్రత్యర్ధులకు ఇవ్వకూడదని డిసైడ్‌ అయ్యారు. ఇందుకోసం అభ్యర్దుల ఖరారులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్‌ లను మార్పు చేసిన సీఎం జగన్‌..మలి విడత జాబితాతో సిద్దం అయినట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు 

ఏపీలో ఈ సారి ఎన్నికల్లో హోరా హోరీగా మారుతున్నాయి. జగన్‌కు అధికారం నిలబెట్టుకోవటం కీలకం. అధికారంలోకి రావటం టీడీపీ - జనసేనకు అంతకంటే ముఖ్యం. దీంతో అభ్యర్దుల ఎంపిక పైన జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపు కోసం ఏ చిన్న అవకాశం వదులుకోకూడదని డిసైడ్‌ అయ్యారు. అందులో భాగంగా నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాల కోసం ఇంఛార్జ్‌ల మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 11 మందిని మార్చిన జగన్‌ మరో 40 మంది వరకు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండో జాబితాలో పలువురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి తమ్మినేని స్థానంలో సువ్వారి గాంధీకి లేదా ఒక డాక్టర్‌కు సీటు ఇచ్చే వీలుందని సమాచారం.

గెలుపే ప్రామాణికంగా 

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తోంది. అలాగే కొవ్వూరు (ఎస్సీ) ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం (ఎస్సీ)కి బదిలీ చేసే యోచనలో ఉంది. మంత్రి.. అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్‌ను తప్పిస్తారని అంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధను బరిలోకి దించే అవకాశాలున్నాయి. మంత్రులు జోగి రమేశ్‌ (పెడన), అంబటి రాంబాబు (సత్తెనపల్లి)ను వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చటం లేదా లోక్‌సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే పి.దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగా గీతకు టికెట్‌ ఇవ్వొచ్చని తెలుస్తోంది. దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్‌ను, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని లోక్‌సభకు పంపే అవకాశాలున్నాయి.

మార్చే సీట్లు 

వీరితో పాటుగా సీట్లు మార్చే స్థానాల్లో పలువరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శెట్టి ఫాల్గుణ (అరకు-ఎస్టీ), కన్నబాబురాజు (యలమంచిలి), గొల్ల బాబూరావు (పాయకరావుపేట) పి.ఉమాశంకర్‌ గణేశ్‌ (నర్సీపట్నం), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ (పత్తిపాడు), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), తలారి వెంకటరావు (గోపాలపురం-ఎస్సీ), రక్షణనిధి (తిరువూరు-ఎస్సీ), సింహాద్రి రమేశ్‌బాబు (అవనిగడ్డ), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్‌), , కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు), వి.వరప్రసాదరావు (గూడూరు), ఆర్థర్‌ (నందికొట్కూరు), సుధాకర్‌ (కోడుమూరు), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకట్రామిరెడ్డి (గుంతకల్‌), తిప్పేస్వామి (మడకశిర), శ్రీధర్‌రెడ్డి (పుట్టపర్తి), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), శ్రీనివాసులు (చిత్తూరు), వెంకటగౌడ (పలమనేరు)లను మార్చే అవకాశం ఉందని ప్రచారం వేళ..జగన్‌ నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అభ్యర్థుల్ని మార్చితే వ్యతిరేకత తగ్గుతుందా ?

ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల మార్పు ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళుతోంది. ఆయా అభ్యర్థులతో పాటు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అని స్పష్టం అవుతోందని అందుకే ముఖ్యమంత్రి జగన్‌ ఆయా అభ్యర్థులను మార్చుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై వ్యతిరేకత కొంత ఉంటే, మిగతాది ప్రభుత్వ చర్యల కారణంగానే వ్యతిరేకత వ్యక్తం అవుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందుకే మార్చుతున్నామని ఆ పార్టీ నాయకుల చర్యలే తెలియజేస్తున్నాయని టీడీపీ నాయకులు లోలోన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !