CBN : వ్యూహానికి విరుగుడుగా చంద్రబాబు ప్రతివ్యూహం !

0

  • ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్‌ షాక్‌ ! 
  • పీకేను దూరం చేసిన లోకేష్‌ ! 

చంద్రబాబు జైల్లో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢల్లీి వెళ్లిన లోకేశ్‌  రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేను తమతో కలిసి పని చేయడానికి ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. వ్యూహం సినిమా రిలీజ్‌ కు ముందే టీడీపీ ప్రతివ్యూహం అమలు చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) ను టీడీపీ తనవైపు తిప్పుకుంది. మరోరకంగా చెప్పాలంటే వైసీపీకి పీకే వ్యూహాలను దూరం చేసింది. మూడు నెలల క్రితమే పీకే, టీడీపీ మధ్య బంధం బలపడుతున్నా.. పసిగట్టలేకపోయింది వైసీపీ. అకస్మాత్తుగా పీకే విజయవాడలో ప్రత్యక్షం కావడంతో వైసీపీకి షాక్‌ తలిగినంత పనైంది. దీంతో పీకేపై  ప్రతిదాడి తీవ్రం చేసింది.

 విజయవాడలో ప్రత్యక్షమైన ప్రశాంత్‌కిషోర్‌ !

ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరొందిన ప్రశాంత్‌ కిశోర్‌ అలియాస్‌ పీకే సడెన్‌గా సీఎం జగన్‌ కు రaలక్‌ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీని విజయతీరాలకు చేర్చిన పీకే.. ఉరుము లేని మెరుపులా విజయవాడలో ప్రత్యక్షమై వైసీపీకి షాక్‌ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో టీడీపీకి టచ్‌ లోకి వచ్చిన పీకే అధికార వైసీపీకి హ్యాండ్‌ ఇచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపారు. 2014 నుంచి ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తిగా దేశంలోనే గుర్తింపు పొందిన పీకే అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించి సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత వరుసగా బీహార్‌, ఏపీ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జేడీయూ, వైసీపీ, తృణమూల్‌, డీఎంకే పార్టీల విజయానికి కృషి చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్‌ఎస్‌ కు అనుబంధంగా పని చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌.. ఎన్నికలకు ముందే పీకే సేవలకు దూరమవగా ఏపీలో వైసీపీ ఇప్పటికీ ఐప్యాక్‌ సేవను వాడుకుంటోంది. అయితే ఐప్యాక్‌ తో సంబంధాలు తెంచుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయాలపై ఆసక్తితో సొంత రాష్ట్రం బీహార్‌ పై ఫోకస్‌ చేశారు.

 జగన్‌ తో పెరిగిన గ్యాప్‌..

ఇలా వైసీపీతో బంధం తెంచుకున్న పీకే చాలా కాలంగా తన వృత్తిని వదిలేశారు. పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అంతేకాకుండా జాతీయ మీడియాలో వివిధ రాష్ట్రాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన మార్క్‌ విశ్లేషణ పంచుకునే వారు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఓసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం జగన్‌ తో పీకేకి గ్యాప్‌ మరింత పెరిగిపోయిందంటున్నారు. ఈ క్రమంలోనే పీకే, సీఎం జగన్‌ మధ్య అంతరం ఉన్నట్లు గుర్తించిన టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పక్కాగా పావులు కదిపి వైసీపీకి షాక్‌ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో ఢల్లీికి వెళ్లిన లోకేశ్‌ ను పీకే కలిసినట్లు తెలుస్తోంది. బాబును అరెస్ట్‌ చేసి జగన్‌ తప్పు చేశారనే భావనతో ఉన్న పీకే.. లోకేశ్‌ తల్లి భువనేశ్వరిని ప్రజల్లోకి వెళ్లేలా యాత్ర చేయమని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక పీకే తమ పట్ల సానుకూలంగా ఉన్నట్లు గ్రహించిన లోకేశ్‌.. తనకున్న పరిచయాలతో వైసీపీకి వ్యతిరేకంగా స్కెచ్‌ వేసి పీకేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా, తమతో కలిసి పని చేసేలా ఒప్పించినట్లు సమాచారం.

ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే టీడీపీకి సపోర్ట్‌..

ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్న పీకే.. నేరుగా పనిచేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి చివరికి టీడీపీ వ్యూహకర్త రాబిన్‌ శర్మకు సహకరించాలని నిర్ణయిం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇకపై టీడీపీ సోషల్‌ మీడియాను పీకే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వ్యూహకర్తగా ప్రస్తుతం ఉన్న రాబిన్‌ శర్మ గతంలో పీకేతో కలిసి ఐప్యాక్‌లో పని చేశారు. వీరిద్దరితో పాటు ప్రస్తుతం రాబిన్‌ శర్మతో కలిసి పని చేస్తున్న శంతను సింగ్‌ కూడా టీడీపీ ప్రచార కార్యక్రమాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా అధికార వైసీపీ సోషల్‌ మీడియా దాడిని తిప్పికొట్టడంలో పటిష్టమైన క్యాంపైనింగ్‌ చేయడానికి పెద్ద నెట్‌ వర్క్‌ నే ఏర్పాటు చేశారు నారా లోకేశ్‌. ఇదంతా చంద్రబాబు అరెస్ట్‌ అయి జైల్లో ఉన్నప్పుడే జరిగిందంటున్నారు.

పీకే ఎంట్రీతో వైసీపీ ఎదురుదాడి..

సడెన్‌గా చంద్రబాబును పీకే కలవటంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ కుదుపుకు లోనైంది. నిన్నటి దాకా ఐప్యాక్‌నే నుమ్ముకున్న వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకషకులు చెప్తున్నారు. ప్రశాంత్‌కిషోర్‌ను టీడీపీ తనవైపు తిప్పుకుంది అనుకోవటం కంటే వైసీపీ బలాన్ని తనవైపు తిప్పుకోవటంతో వైసీపీలో గుబులు మొదలైందనే చెప్పాలి. అయితే, ఇన్నాళ్లు వైసీపీతో అనుబంధం కొనసాగించిన ప్రశాంత్‌ కిశోర్‌ అనూహ్యంగా ప్లేట్‌ ఫిరాయించడంపై మండిపడుతోంది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌, అమర్నాథ్‌ వంటి వారు.. ఎంతమంది పీకేలు వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరు అని ఎదురుదాడి మొదలుపెట్టారు. ఏది ఏమైనా పీకే వ్యూహాలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలిసిన వైసీపీ ప్రతివ్యూహాలకు  పదును పెడుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !