Bramayugam Movie Review : భ్రమయుగం సిన్మా రివ్యూ

0


ప్రయోగాత్మక కథలకు.. వైవిధ్యభరితమైన పాత్రలకు పెట్టింది పేరు మమ్ముట్టి. ఇప్పుడు మమ్ముట్టి ‘భ్రమయుగం’ అనే మరో ప్రయోగాత్మక చిత్రం విడుదలైంది. పూర్తిగా నలుపు తెలుపు రంగుల్లో రూపొందిన ఇందులో మమ్ముట్టి ఓ భిన్నమైన పాత్ర పోషించారు. ఇది ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకోగా.. ఇప్పుడు తెలుగులోనూ విడుదలైంది. మరి ‘భ్రమయుగం’ వెడితెరపై ఎలాంటి అనుభూతి పంచింది? అసలీ కథేంటి? మమ్ముట్టి నటన ఎలా అనిపించింది?

కథేంటంటే

అది 17వ శతాబ్దం.. మలబార్‌ తీరం. ఓ రాజు ఆస్థానంలో పాటలు పాడే తక్కువ కులానికి చెందిన జానపద గాయకుడు దేవన్‌ (అర్జున్‌ అశోకన్‌). తను ఆ రాజు దగ్గర నుంచి తప్పించుకుని ఇంటి దగ్గరున్న తల్లిని కలుసుకునేందుకు మిత్రుడితో కలిసి అటవీ మార్గంలో బయలుదేరుతాడు. కానీ, ఈ క్రమంలో ఆ దట్టమైన అడవిలో తప్పిపోతాడు. అదే సమయంలో తన మిత్రుడ్ని యక్షి (అమల్డా లిజ్‌) తినేస్తుంది. ఒంటరి అయిపోయిన దేవన్‌ ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ.. అటు ఇటు తిరిగి ఓ పెద్ద పాడుబడిన ఇంటిలోకి అడుగు పెడతాడు. అక్కడ యజమాని కొడుమన్‌ పొట్టి (మమ్ముట్టి), వంటవాడు (సిద్ధార్థ్‌ భరతన్‌) మాత్రమే ఉంటారు. చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అతిథి వచ్చాడని చెప్పి దేవన్‌ను కొడుమన్‌ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్‌కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొద్దిరోజుల్లోనే తను ఆ ఇంట్లో బందీ అయినట్లు తెలుసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. కొడుమన్‌ తన తాంత్రిక విద్యలతో అతణ్ని మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు కొడుమన్‌ పొట్టి ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని నిజ స్వరూపం గురించి తెలిసి కూడా వంటవాడు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు? తను.. దేవన్‌ ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే

ఇదొక భిన్నమైన డార్క్‌ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌. అలాగే ఈ కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ.. ఒకే పాడుబడ్డ ఇంటిలోనే తిరుగుతుంటుంది. కానీ, ఏ ఒక్క ఫ్రేమ్‌లోనూ చూసిందే మళ్లీ చూస్తున్నామన్న అనుభూతి, కథ ఒకే దగ్గర తిరుగుతుందన్న భావన కలగకుండా తీయడంలో రాహుల్‌ సదాశివన్‌ మంచి మార్కులు కొట్టేశారు.  ఓ పాడుబడిన భవనంలో.. తాంత్రిక విద్యలు నేర్చిన ఓ మంత్రగాడి బారి నుంచి ఓ యువకుడు ఎలా తనని తాను రక్షించుకున్నాడన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. దీంట్లో కులవివక్షను.. అధికారం మనిషిని రాక్షసుడిగా ఎలా మారుస్తుంది? అన్న విషయాల్ని అంతర్లీనంగా చర్చించారు.వన్‌ అడవిలో దారితప్పిపోయి అటు ఇటు తిరుగుతున్న సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తనతో పాటు వచ్చిన మిత్రుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం.. అతన్ని యక్షి తినేయడం.. అది చూసి దేవన్‌ భయంతో అడవిలో పరుగులు తీయడం.. ఈ క్రమంలో పాడుబడ్డ కొడుమన్‌ ఇంట్లోకి అడుగు పెట్టడం.. ఇలా కథ చకచకా పరుగులు పెడుతుంది. కొడుమన్‌గా మమ్ముట్టి పరిచయ సన్నివేశాలు ఆసక్తిరేకెత్తించేలా ఉంటాయి. ఆయన ఇంటి వాతావరణం.. ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి దేవన్‌కు ఎదురయ్యే అనుభవాలు ప్రతిదీ ఉత్సుకత కలిగించేలాగే ఉంటాయి. విరామానికి ముందు కథలోని అసలు ట్విస్ట్‌ బయటకొస్తుంది. అప్పుడే కొడుమన్‌లోని మరో రూపం ప్రేక్షకులకు పరిచయమవుతుంది. కొడుమన్‌ పొట్టి నేపథ్యం.. ఈ క్రమంలో వచ్చే చుడలన్‌ పొట్టి.. చేతన్‌ల కథ.. అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. కొడుమన్‌ మానవ రూపంలో ఉన్న రాక్షసుడని తెలిసిన తర్వాత నుంచి దేవన్‌ వేసే ప్రతి అడుగు ఆసక్తిరేకెత్తించేలా ఉంటుంది. కొడుమన్‌ సభా మందిరం కిందున్న నేలమాళిగ.. దాంట్లోని మరో ప్రపంచం.. అందులో ఉన్న అఖండ దీపం.. దాన్ని చేరుకునేందుకు దేవన్‌ - వంటవాడు కలిసి వేసే ఎత్తుగడ.. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే భయానక అనుభవాలు అన్ని ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేలా చేస్తాయి. ఇక పతాక సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. వీటన్నింటినీ దర్శకుడు చూపించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అలాగే అది ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా చేస్తుంది. 

ఎవరెలా చేశారంటే

ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ మమ్ముట్టి నటనే. కొడుమన్‌ పాత్రలో ఆయన కనిపించిన తీరు.. ఆహార్యం.. పలికించిన హావభావాలు.. నటన అన్నీ ప్రేక్షకుల్ని మురిపిస్తాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన అందర్నీ కట్టిపడేస్తుంది. దేవన్‌ పాత్రలో అర్జున్‌ అశోకన్‌ ఒదిగిన తీరు కూడా అందర్నీ మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో ఆయన.. మమ్ముట్టి నువ్వా-నేనా అన్నట్లు పోటీపడి నటించారు. వంటవాడుగా సిద్ధార్థ్‌ నటన కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. (%దీతీaఎaవబస్త్రaఎ వీశీఙఱవ Rవఙఱవష%)  యక్షి పాత్ర ఆరంభంలో ఆసక్తిరేకెత్తించినా.. సినిమాలో దానికున్న ప్రాధాన్యమేంటో అర్థం కాదు. దర్శకుడు రాసుకున్న కథ.. దాని కోసం సృష్టించిన భ్రమయుగం అనే ఊహాత్మక ప్రపంచం.. అందులోని పాత్రలు.. అన్నీ ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇక క్రిస్టో స్వరపరిచిన ప్రతి పాట.. కథలో భాగంగా చాలా అర్థవంతంగా ఉంటాయి. నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని కథలో లీనం చేసేలా చేస్తుంది. సినిమా పూర్తిగా నలుపు తెలుపు రంగుల్లో ఉన్నా ప్రతి సీన్‌ తెరపై చాలా అందంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !