Delhi New CM : దిల్లీ సిఎంగా సునీత కేజ్రీవాల్‌ ?

0

దిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ జైలు నుండే పాలన కొనసాగిస్తున్నారు. కానీ ఈ కేసు కోర్టులో ఎంత కాలం కొనసాగుతుందో తెలియటం లేదు. లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యే వరకు బెయిల్‌ వచ్చే అవకాశం లేదని ఉద్ధేశ్యంలో కేజ్రీవాల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌ను దిల్లీ సిఎంగా కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలు నుండి ఎన్నో రోజులు పాలన సాగించటం నైతికంగాను మంచిది కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలోనే ఆమెను సిఎంగా కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో ఆ దిశగా సునీత కేజ్రీవాల్‌ను సిద్ధం చేసినట్లు  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అరెస్టును అనైతిక చర్యగా బీజేపీ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది కేజ్రీవాల్‌ తన భార్య సునీతకు తెలియజేశారట. ఈ చర్యలను సానుభూతిగా మార్చుకుని దిల్లీ, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) మాజీ అధికారి. 22 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో సేవలందించారు. భోపాల్‌లో శిక్షణ సమయంలో కేజ్రీవాల్‌తో పరిచయం ఏర్పడిరది. ఆమె 1994 బ్యాచ్‌కు చెందినవారు కాగా.. కేజ్రీవాల్‌ 1995 బ్యాచ్‌కు చెందినవారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !