Mallareddy College : విద్యార్థుల ధర్నా ! అన్యాయంగా డిటైన్‌ చేశారు !

0


హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మల్లారెడ్డి అగ్రికల్చర్‌ వర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, చదువు విషయంలో కనీస నిబంధనలు పాటించకుండా, అశ్రద్ద వహిస్తున్నారని వాపోయారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల చదువు విషయంలో లేదని యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం విద్యార్థులు మల్లారెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి మల్లారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలపడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు వైఖరికి నిరసనగా విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అగ్రికల్చర్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సుమారు 50 మందిని డీటైన్‌ చేశారని, పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా అధికారులు స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని ధర్నాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హనుమంత రావు మద్దతు తెలిపారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు - మైనంపల్లి 

ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నో అక్రమాలు చేశావన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మీ ఆటలు సాగవాన్నారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి ఐ కార్‌ అనుమతి అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు కళాశాలకు ఐ కార్‌ అనుమతి లేదంటూ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా డిటైన్‌ పేరుతో వేధిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఊరుకోదని,రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగుతుందని ఇక నీ ఆటలు సాగవన్నాడు. నీ అక్రమాల చిట్టా బయటకు తీస్తాం అంటూ హెచ్చరించాడు. పోలీసులు సంయమనం పాటించాలని యాజమాన్యానికి తొత్తులుగా మారొద్దని హితవు పలికారు. మల్లారెడ్డి చేసిన అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటపడుతుందని త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని బిడ్డ మల్లారెడ్డి విద్యార్థులను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. ఐ కార్‌ అనుమతి ఉంటే తప్పిపోయిన సబ్జెక్ట్‌ కు తిరిగి పరీక్షలకు అనుమతి ఉంటుందన్నారు.పరీక్షలకు అనుమతించాలంటూ అడిగిన విద్యార్థులను వేధిస్తున్నారని,యాజమాన్యాన్ని ప్రశ్నించిన 50 మంది విద్యార్థులను డిటైన్డ్‌ చేశారన్నారు.న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,విద్యార్థి సంఘాలు,విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !