Volunteers : వాలంటీర్ల చుట్టూ రాజకీయం...అధికార, విపక్ష పార్టీల రచ్చ !

0

ఏపీ పాలిటిక్స్‌ సమ్మర్‌ను మించి హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాల పార్టీల మధ్య ప్రతీ ఇష్యూపై రాజకీయ రచ్చ రాజుకుంటుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. పెన్షన్ల పంపిణీ- వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ-కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తాయి. అంతే కాకుండా వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇటీవలే ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రచ్చ రాజుకుంది. చంద్రబాబు అండ్‌ కో వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యయాని..పలువురి మరణాలకు కారణమయ్యారని వైసీపీ ఆరోపించింది. అయితే ప్రత్యామ్నాయలు చేయడంలో విఫలమై తమపై నిందలేస్తారా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

డ్యామెజీ కంట్రోల్‌కేనా ?

పెన్షలు అందకపోవడానికి కారణం చంద్రబాబే అని ఇప్పటికే వాలంటీర్లు ప్రచారం చేయటంతో పెన్షనర్లు టీడీపీపై కోపంతో ఉన్నారు. అసలే ఎండలు మండుతున్న సమయంలో ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్లను కట్టిడి చేశారని నమ్మటంతో చంద్రబాబు డిఫెన్స్‌ పడిపోయారు. ఆ వెంటనే డ్యామేజీ కంట్రోల్‌కి దిగారు. వాలంటీర్ల వ్యవస్థకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల జీతం నెలకు 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.  వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తానని చెబుతున్నారు. దీనికి తోడు రాజీనామా చేసే వాళ్లు చేసేయండి.. అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థపైనే పెడతానని కూడా జగన్‌ చెబుతున్నారు. మరోవైపు.. కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని.. ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. 

వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్‌ !

వాలంటీర్ల పారితోషికం రూ.10 వేలకు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్నినాని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. తాయిలాలు ప్రకటిస్తున్నారంటే వాలంటీర్‌ వ్యవస్థ సక్సెస్‌ నిదర్శమన్నారు పేర్నినాని. వాలంటీర్లు రెండున్నర లక్షల మంది తన సైన్యంగా గతంలోనే చెప్పారు ఏపీ సీఎం జగన్‌. అదే వాలంటీర్లు ఇప్పుడు టీడీపీ, జనసేనకు కీలకమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చి సెట్‌ చేస్తానని జగన్‌ చెబుతున్నారు. మొత్తంగా ఏపీ ఎన్నికలవేళ ఓటర్లతోపాటు వాలంటీర్లు ఓ బ్రాండ్‌ అయిపోయారు.

జగనన్న పాలకు నిదర్శనం !

వలంటీర్‌ వ్యవస్థపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌, గౌరవ వేతనంపై ట్విట్టర్‌ వేదికగా వైసీపీ స్పందించింది. ‘ వలంటీర్‌ వ్యవస్థ శక్తిని గుర్తించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ, జననసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ఇది జగనన్న పాలనా విజయానికి నిదర్శనం. అందుకే విపక్షాలు కూడా ఆదరించి, పాటించాలని అనుకునేలా చేసింది. మీరేం చింతించకండి.. జూన్‌-04న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వలంటీర్‌ వ్యవస్థను పునరుద్ధరిస్తాం’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది వైసీపీ. దీనిపై టీడీపీ శ్రేణులు.. వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం నడుస్తోంది.నేనున్నా.. మాటిస్తున్నా..!

కొనసాగిస్తామంటున్న టీడీపీ !

కాగా.. అంతకుముందు చంద్రబాబు కూడా ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశారు. ‘వలంటీర్లూ.. తన రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న వైఎస్‌ జగన్‌ మాయ మాటలను నమ్మకండి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లుగా మిమ్మల్నే కొనసాగించడమే కాదు.. మీ గౌరవ వేతనాన్ని రూ. 10 వేలు చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. ఈ ట్వీట్‌కు ఉగాది సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన వీడియోను యాడ్‌ చేయడం జరిగింది. ఈ ట్వీట్‌కు రిప్లయ్‌ ఇస్తూ వైసీపీ పై విధంగా స్పందించింది. ఇదిలా ఉంటే.. కూటమి అధికారంలోకి వస్తే.. వలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా ఖండిరచారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. కొనసాగిస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !