Sonia Gandhi : రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి

0

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తున్నారని అన్నారు. దేశం కొందరి సొత్తు కాదనీ, అందరికీ చెందుతుందని, మన పూర్వీకులు దాని కోసం రక్తాన్ని చిందించారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, మన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర జరుగుతోంది అని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశం గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ, తనను తాను ఒక గొప్పవ్యక్తిగా మోదీ భావించుకుంటూ దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. బీజేపీలో చేరాలని విపక్ష నేతలను బెదిరిస్తున్నారని, ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఇదంతా నియంతృత్వమేనని, దానికి కలిసికట్టుగా గుణపాఠం చెప్పాలని కోరారు.

ఖర్గే మాట్లాడుతూ 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీని అబద్ధాల నాయకుడు అని అభివర్ణించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరారు. మీరు మూడిరట రెండొంతుల మెజారిటీ ఇస్తే.. ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రధాని మోదీ, ఆయన వ్యక్తులు, ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నాయని ఖర్గే అన్నారు.

ఈ ఎన్నికలు చాలా కీలకం: సచిన్‌ పైలట్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికలు ఎంతో నిర్ణయాత్మక ఎన్నికలని అన్నారు. రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరచడమే కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. రైతులకు కనీసమద్దతు ధర కల్పిస్తామని తొలిసారిగా మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించారని, ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని అన్నారు.

బీజేపీ హయాంలో విపక్షాలే టార్గెట్‌: ప్రియాంక

ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, జారా‰ండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌లను ఈడీ అరెస్టు చేయడాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రస్తావిస్తూ, కేంద్రంలోని బీజేపీ హయాంలో విపక్షాలు దాడులకు గురవుతున్నాయని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నాయని, రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోకు ‘’న్యాయ్‌ పాత్ర’’ అనే పేరు పెట్టిందని, ఇది ఎంతమాత్రం ఎన్నికల తర్వాత మరిచిపోయే ప్రకటనల జాబితా ఎంతమాత్రం కాదని, న్యాయం కావాలని కోరుకుంటున్న దేశప్రజల వాణి అని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !