UPSC : 3 వ ర్యాంకుతో నారాయణ సంచలనం !

0

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (CIVILS) - 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నారాయణ IAS అకాడమీకి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరి అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. అలాగే దొనక పృధ్వీరాజ్‌ కుమార్‌ 493 వ ర్యాంకు,  సి.హెచ్‌. నరేంద్ర పడాల్‌ 545 వ ర్యాంకు, ధరావత్‌ సాయిప్రకాష్‌ 919 వ ర్యాంకు సాధించారు.

డైరెక్టర్స్‌ మాట్లాడుతూ...

ఈ సందర్భంగా కోహెడలోని నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ డా॥పి. సింధూరనారాయణ Ê పి.శరణినారాయణ మాట్లాడుతూ సివిల్స్‌ అనేది కష్టతరమైన లక్ష్యంగా నేటి తరం యువత భావిస్తోందన్నారు. ఇష్టపడి చదివితే కచ్చితంగా విజయం సాధించవచ్చునన్నారు. పట్టుదల, నిరంతర కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు. అన్ని సమకాలీన అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉంటే సివిల్స్‌ను సాధించటం పెద్ద కష్టమేమీ కాదని మరోసారి నిరూపించామన్నారు. 21 సంవత్సరాలకే ఐఏఎస్‌ కలను నెరవేర్చేందుకు నారాయణ ఇంటిగ్రేటెడ్‌ ఐఏఎస్‌ అకాడమీనీ తీర్చిదిద్దినట్లు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా వేలాది మందిని ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత నారాయణకు ఉందన్నారు. అందుకు సాక్ష్యమే నేడు సాధించిన విజయాలుగా అభివర్ణించారు. ఆలిండియా 3 వ ర్యాంకు సాధించిన డి. అనన్య రెడ్డి నారాయణ 2 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ అకాడమీలో  (2016-2018) శిక్షణ పొందినట్లు తెలిపారు. అలాగే 493 వ ర్యాంకు సాధించిన పృధ్వీరాజ్‌ కుమార్‌ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ అకాడమీలో  (2015-2020) శిక్షణ పొందినట్లు చెప్పారు. అలాగే సి.హెచ్‌. నరేంద్ర పడాల్‌ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ అకాడమీలో (2016-2021) శిక్షణ తీసుకుని విజయం సాధించిన వారేనని పేర్కొన్నారు. ఇదేవిధంగా ఐఏఎస్‌ అకాడమీలో విద్యార్థులను తమ లక్ష్యాల వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్స్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో నారాయణ ఐఏఎస్‌ అకాడమీ కోర్‌ డీన్‌ ఎన్‌.రామలింగారెడ్డి, వైస్‌ ప్రెసిడెండ్‌ నాగేంద్ర ప్రతాప్‌, డీన్‌ మనోజ్‌కుమార్‌, ప్రిన్సిపాల్స్‌, లెక్చరర్స్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !