Betting Apps : బెట్టింగ్‌, రమ్మీ, గేమింగ్‌ యాప్స్‌ ఉచ్చులో యువత !

0

బెట్టింగ్‌ యాప్స్‌ (Betting Apps) బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు అంతకంతకీ పెరిగిపోతున్నా.. సెలబ్రిటీలు (Celebrities) మాత్రం బాధ్యతారాహిత్యంగా ఈ బెట్టింగ్‌ యాప్‌లను విరివిగా ప్రమోట్‌ చేస్తున్నారు. వాళ్లు ఆస్తులు పోతే పోనియ్‌.. ప్రాణాలు తీసుకుంటే తీసుకోనియ్‌.. మాకు ఇచ్చే డబ్బు ఇస్తున్నారు కదా అని.. ఏ మాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్‌ (Betting Apps) యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారు సెలబ్రిటీలు. సోషల్‌ మీడియాలో (Social media)  కాస్త పాపులారిటీ వచ్చిందంటే..వాళ్లందరికీ వలేసి మరీ ఈ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయిస్తున్నారు. ఇక మన యాంకర్లు, (Anchors) యూట్యూబర్లు, (Youtubers) సోషల్‌ మీడియా ఇన్ఫ్లయోన్సర్‌లు (Social media Influenciers) డబ్బులొస్తున్నాయి కదా అని.. ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను (Betting Apps) ప్రమోట్‌ చేసి.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 6.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉండి దేశంలోనే నెంబర్‌ 1 యూట్యూబర్‌గా ఉన్న హర్షసాయి( Harsha Sai) .. పేదలకు ఎంతో సాయం చేస్తూ.. అందరి మన్ననలు పొందుతున్న హర్షసాయిపై బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్‌తో కోట్లాది రూపాయలు వెనుక వెసుకుంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతనితో పాటు కొంచం పాపులారిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా (Betting Apps) బెట్టింగ్‌ యాప్‌లను విరివివిగా ప్రమోట్‌ చేస్తూ.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక్కో బెట్టింగ్‌ యాప్‌కి ఐదు కోట్ల నుంచి పది కోట్ల పైనే తీసుకుంటున్నాడని ఇతనిపై ఆరోపణలు వస్తున్నాయి. హర్షసాయి వల్ల అనేక మంది ఈ బెట్టింగ్‌ యాప్‌ ఉచ్చులో ఇరుక్కుంటున్నారని.. కోట్లాదిరూపాయిలు పొగొట్టుకుని అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఫోన్‌లో బెట్టింగ్‌ యాప్స్‌ను డిలీట్‌ చేయండి, చేయించండి !

సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తులు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులు ఈ బెట్టింగ్‌ యాప్‌లను (Betting Apps) ప్రయోట్‌ చేస్తున్నారు. ఇన్ఫయోన్సర్‌లు తమ ఫాలోయర్స్‌లు మోసం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నమ్మకద్రోహం చేస్తున్నారు. అలా చేస్తున్న వారిని కొద్ది సేపు ప్రక్కన పెట్టండి. సమాజంలో టెక్నాలజీతో వచ్చిన రుగ్మతలపై అవగాహన కల్పించటంతో పాటు రూపుమాపాల్సిన బాధ్యత మనపైన ఉంది. ప్రతి ఒక్కరూ యాంటీ బెట్టింగ్‌ & రమ్మీ యాప్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించండి. ప్రభుత్వాల దాకా చేరి చర్యలకు ఉపేక్షించే వరకు వేచి చూస్తే మరికొందరు బలి అయ్యే అవకాశం ఉంది. కావున ప్రతి సిటిజన్‌ ఈ బెట్టింగ్‌ (Betting Apps), రమ్మీ (Online Rummy),  కాసినో (Casino), క్రిప్టో (Crypto),  గేమింగ్‌ (Gayming Apps) యాప్‌లను అన్ని ఫోన్‌లలో డిలీట్‌ చేసే ఉద్యమంలో పాల్గొనండి. అవగాహన పెంచుకోండి, పదిమందిని చైతన్య పరచండి. మొదటగా టెలిగ్రామ్‌ యాప్‌ను (Telegram App Delite) డిలీట్‌ చేయండి, ఆ తర్వాత బెట్టింగ్‌, గేమింగ్‌కు సంబంధించిన ఏ యాప్‌ ఉన్నా డిలీట్‌ చేయండి. మీ చుట్టుప్రక్కల వారి ఫోన్‌లను చెక్‌ చేసి తీసివేయండి. ఎందుకంటే మీరు ఎంత బెట్టింగ్‌ పెట్టినా, రమ్మీ గేమ్స్‌ ఆడినా మొత్తం పోతూనే ఉంటాయి. మీరు ఇంకా, ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. ఆ యాప్‌, ఈ యాప్‌ అని కాదు, అన్నీ (ALL BETTING APPS) యాప్‌లోనూ అంతే. ఫస్ట్‌ మిమ్మల్ని కొన్ని గేమ్స్‌లో గెలిపిస్తారు. చిన్నగా అలవాటు చేస్తారు,  ఆ తర్వాత బానిసగా మార్చుకుంటారు. గేమ్‌ ఆడకుండా ఉండలేని స్థితికి తీసుకొస్తారు.  అప్పులు చేయిస్తారు, బ్యాంకుల్లో లోన్లు తీసుకునేలా చేస్తారు...డబ్బులన్నీ పోతాయి తప్పించి, గెలవలేరు.  యాప్‌లో పనిచేసే ఏజెంట్‌లకు ప్రత్యేకంగా కమీషన్‌ ఇవ్వటంతో పాటు...ఇన్ఫయోన్సర్‌కి రూ. 200 /` తో లాగిన్‌ అయితే 68/`కమీషన్‌ చేరుతుంది. చివరిగా లాభ పడేది ఎవరంటే ఇన్ఫయోన్సర్‌లు మాత్రమే. 

డబ్బు గెలిచినోడు ఒక్కడు లేడు !

ఎందుకంటే ఆ యాప్‌కు ఉపయోగించే సాప్ట్‌వేర్‌ (Special Software) అలాంటిది. ఆయా కంపెనీల సాప్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌లు ఎలా రాస్తే అలాగే పనిచేస్తుంది. డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (Data Science & AI) సహాయంతో వాళ్ళకు నచ్చినట్టుగా కోడిరగ్‌తో యాప్‌ లేదా వెబ్‌సైట్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ లాగిన్‌ అయ్యే ప్రతి కస్టమర్‌ మైండ్‌ని రీడ్‌ చేస్తుంది. ఎక్కువ సేపు గేమ్‌లోనే సమయం గడిపేలా చేస్తుంది. చిన్న మొత్తాల్లో పెడితే గెలిచేలా చేస్తుంది. అదే సమయంలో పెద్ద మొత్తంలో బెట్‌ పెట్టగానే లాస్‌ చేసేలా చేస్తుంది. అలా సాప్ట్‌వేర్‌ రూపొందిస్తున్నాయి బెట్టింగ్‌ & గేమింగ్‌ యాప్‌లు. మొత్తంగా ఏ గేమ్‌లో డబ్బులు పెట్టినా పోవటం మాత్రం ఖాయం. ఉదాహరణకు బయట ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్‌ పెడితే...ఒకరు ఒడతారు, మరోకరు గెలుస్తారు. ఇదీ మనకు తెలిసిన నిజం. కానీ బెట్టింగ్‌, రమ్మీ యాప్స్‌లో గెలిచిన వాడు ఒక్కడు ఉండడు. బెట్టింగ్‌ యాప్స్‌లో ఒక ఇన్షయోన్సర్‌ 10 టిప్స్‌లో 7 విన్స్‌ ఉంటాయి, 3 పోతాయి అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు అంటే ముందుగానే ప్రోగ్రామించే చేయబడిన వాటిలోనే డబ్బు గెలవగలరు, మిగలిని వాటిలో పోతాయి అని చెప్పకనే చెబుతున్నారు. అదే రమ్మీ యాప్‌లలో అయితే ప్రతి గేమ్‌కి 10% నుండి 15% కమీషన్‌ రూపంలో లాగేసుకుంటుంది. ఆ కమీషన్‌ రోజుకి కోట్లలో ఉంటుంది అంటే నమ్మగలరా ? గ్యాబ్లింగ్‌లో నిజాయితీని ఎవరైనా ఆశిస్తున్నారు అంటే అది అత్యాశే అవుతుంది. ఏ బెట్టింగ్‌ యాప్‌ అయినా, గేమింగ్‌ యాప్‌ అయినా, ఏ రమ్మీ గేమ్‌ యాప్‌ అయినా వాళ్ళకి అనుకూలంగా రూపొందించుకుంటారు. గేమింగ్‌ యాప్‌లు 200%, 300% నుండి  1500% వరకు బోనస్‌లు ఆఫర్‌ చేస్తున్నాయి అంటే ఆయా కంపెనీలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. మన మీద సంపాదించింన సొమ్మునే మనకే ఉచితంగా ఇస్తున్నట్టు కలరింగ్‌ ఇస్తుంది. ఏ కంపెనీ అయినా డబ్బు పోగోట్టుకోవడానికి రెడీగా ఉంటుందా ? 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !