విద్యారంగంలో అసాధారణ కృషి మరియు సమర్థ నాయకత్వానికి గాను నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా బిజినెస్ అవార్డ్‌ను (SIBA) - 2025 అందుకున్నారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్ పి.సింధూర నారాయణను అవార్డుతో సత్కరించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న ప్రభావశీల వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. డాక్టర్ పి. సింధూర నారాయణ నాయకత్వంలో నారాయణ విద్యాసంస్థ భారతదేశంలోనే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటిగా ఎదిగిందని నిర్వాహకులు ప్రశంసించారు. విద్యార్థుల, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడటంలో ముందుంటూ విద్యారంగంలో విశ్వసనీయతకు చిరునామాగా నిలవటంలో ఆమె కృషిని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ కార్మికశాఖ మంత్రి వివేక్, సినీ తారలు శ్రియాశరణ్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కృషికి గుర్తింపు !
పదేళ్లకు పైగా దక్షిణ భారత సినీ రంగంలోని ప్రముఖులను, అగ్రగాములను గౌరవిస్తున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వారసత్వాన్ని కొనసాగిస్తూ, (SIBA) వ్యాపార రంగానికి విస్తరించింది. దక్షిణ భారత వ్యాపార రంగంలో ఉన్నత విలువలు మరియు నూతన ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు సౌత్ ఇండియా బిజినెస్ అవార్డ్స్ (SIBA) ను నెలకొల్పగా, ఈ అవార్డులు ఆర్థికాభివృద్ధి మరియు పురోగతికి విశిష్టమైన కృషి చేసిన పారిశ్రామికవేత్తలు, సంస్థలు మరియు వ్యాపార దక్షత గల నాయకులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నడుంకట్టింది.
అవార్డు బాధ్యత పెంచింది !
అవార్డును స్వీకరిస్తూ డాక్టర్ పి. సింధూర నారాయణ మాట్లాడుతూ ‘‘ఒక వ్యాపారవేత్తగా, ముందు ఉత్పత్తి తయారు చేసి దానికి మార్కెట్ వెతకడం కంటే, ఉన్న సమస్యలకు పరిష్కారాలను వెతకటం ముఖ్యం అని నేను నమ్ముతాను. నిజమైన పురోగతి అనేది అర్థవంతమైన, ప్రయోజనకరమైన పరిష్కారాల ద్వారా వస్తుంది. నారాయణ విద్యాసంస్థల్లో, ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధి సాధించే విధంగా మరియు విద్యార్థులు, తల్లిదండ్రుల అవసరాలకు తగినట్లుగా నేరుగా స్పందించే విధంగా ఫ్రేమ్‌వర్క్‌లు మరియు పాఠ్యప్రణాళికలను రూపొందించామన్నారు. . దీంతో విద్య ఎల్లప్పుడూ ప్రామాణికంగా, ప్రభావవంతంగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఉంటుంది.’’ 46 ఏళ్ల వారసత్వంతో, నారాయణ విద్యాసంస్థలు ఆసియాలో అతి పెద్ద విద్యాసంస్థలలో ఒకటిగా ఎదిగింది. 900కి పైగా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో 6 లక్షలకుపైగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. ‘‘మీ కలలే, మా కలలు’’ అనే నినాదాన్ని నిజం చేస్తూ, నారాయణ నాణ్యమైన విద్యను అందిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చడానికి తోడ్పడుతోందన్నారు.